టీమిండియా స్టార్ ఓపెనర్, కాబోయే మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా భావించిన శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) కు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. 2026 టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు. వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న ఆటగాడిని ఏకంగా జట్టు నుంచే తప్పించడం క్రికెట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. గిల్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా, ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ ఓపెనర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు.
Read Also: Rohit Sharma: పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్నా

ఎంపికైన జట్టు బలంగా ఉంది
2026 టీ20 ప్రపంచకప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తప్పించడం పై, క్రిస్ శ్రీకాంత్ స్పందించారు. శుభ్‌మన్ గిల్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యమని మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ (Chris Srikanth) అన్నారు. అజిత్ అగార్కర్ కమిటీ ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదన్నారు. అయితే ఎంపికైన జట్టు బలంగా ఉందని ప్రశంసించారు. గిల్ వన్డేల్లో మెరుగైన ఆటగాడైనా, టీ20ల్లో స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉందని, ఇషాన్ కిషన్, రింకు సింగ్ ఎంపిక సరైనదని చెప్పారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లు అవుతారని తెలిపారు (Chris Srikanth) .
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: