ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఘోరంగా ఓడిపోయిన సీఎస్కే, తమ హోమ్ గ్రౌండ్‌లోనే పలు చెత్త రికార్డులు సృష్టించింది. ఈ ఓటమి తర్వాత సీఎస్కే ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

103 పరుగులకే 9 వికెట్లు
ఈ మ్యాచ్‌లో సీఎస్కే జట్టు కేవలం 103 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఇది చెపాక్ స్టేడియంలో జట్టుకు ఇది ఇప్పటివరకు చేసిన అతి తక్కువ స్కోరు. ఇక మొత్తంగా చూస్తే, సీఎస్కే చరిత్రలో ఇది మూడవ అతి తక్కువ స్కోరుగా నమోదైంది. జట్టు బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. టాపార్డర్ నుంచి దిగిన బ్యాట్స్‌మెన్ ఎవరూ సమర్థవంతంగా రాణించకపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.
మరో చెత్త రికార్డు
ఈ ఓటమితో మరో చెత్త రికార్డు కూడా నమోదైంది. తొలి సారిగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే వరుసగా 5 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. అంతేకాకుండా చెపాక్‌లో వరుసగా 3 మ్యాచుల్లో ఓటమిపాలై తమ హోమ్ గ్రౌండ్‌లోనే కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. బాల్స్ పరంగా చూస్తే 59 బంతులు మిగిలుండగానే ఓటమిని చవిచూసిన సీఎస్కే, ఇది కూడా ఓ దుర్వినియోగమైన రికార్డుగా మిగిలిపోయింది. అభిమానులు జట్టు పునరుత్థానం కోరుకుంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు.