ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తన దూకుడు చూపించింది.ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఆసక్తికర మ్యాచ్‌లో చెన్నై జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా, శివమ్ దూబే అర్ధశతకాలతో మెరిశారు.మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.తెలుగు క్రికెటర్ షేక్ రషీద్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.కానీ, 20 బంతుల్లో కేవలం 19 పరుగులు చేసి ఔటయ్యాడు. రషీద్ తన ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ మాత్రమే కొట్టాడు.శాంట్నర్ బౌలింగ్‌లో అతడు పెవిలియన్ చేరాడు.ఇంకొక ఓపెనర్ రచిన్ రవీంద్ర భారీ అంచనాలను అందుకోలేకపోయాడు. అతను కేవలం 5 పరుగులతో అవుట్ అయ్యాడు. ఆ సమయంలో చెన్నై జట్టు ఒత్తిడిలో పడింది కానీ, మిడిల్ ఆర్డర్‌లో యువ ఆటగాడు ఆయుష్ మాత్రే మెరుపులు మెరిపించాడు.మాత్రే 15 బంతుల్లోనే 4 బౌండరీలు, 2 సిక్సులు బాదాడు.అతని బ్యాటింగ్ దూకుడు జట్టుకి ఊపొచ్చింది.

మొత్తంగా అతను 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.అతని ఇన్నింగ్స్ దశలో మ్యాచును నిలకడగా నడిపింది.ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే తనదైన శైలిలో ఆడాడు.32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో అర్థసెంచరీ సాధించాడు. అతని పవర్ హిట్టింగ్ ముంబయి బౌలర్లను ఇబ్బందిలో పడేసింది.జడేజా తన అనుభవంతో మరింత స్థిరత ఇచ్చాడు. అతను 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో అజేయంగా 53 పరుగులు చేశాడు. జడేజా చివరి ఓవర్లలో కంట్రోల్ తో ఆడి స్కోరు బోర్డును గణనీయంగా పెంచాడు.మరోవైపు ముంబయి ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మంచి లైన్ తో రెండు కీలక వికెట్లు తీసాడు. దీపక్ చహర్, అశ్వనీకుమార్, శాంట్నర్ తలో వికెట్ తీసారు. కానీ చెన్నై బ్యాటింగ్ ప్రెషర్‌ను అధిగమించి మెరుగైన స్కోరు నమోదు చేసింది.ఈ స్కోరు ముంబయి కోసం చిన్నదే కానీ తేలిక కాదు. చెన్నై బౌలింగ్ దళం ధాటిగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు ఉన్నాయి.
Read Also : IPL 2025 : 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసిన పంజాబ్