టీమిండియా క్రికెట్‌లో సీనియర్ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) ల వన్డే భవిష్యత్తుపై నెలలుగా జరుగుతున్న చర్చకు ఎట్టకేలకు బీసీసీఐ (BCCI) క్లారిటీ ఇచ్చింది. వన్డే జట్టులో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడం తప్పనిసరి అని బోర్డు స్పష్టంగా తెలిపింది.
Read Also: Arshdeep Singh: అర్ష్‌దీప్ కొత్త రైడ్‌తో సెన్సేషన్
టెస్టులు, టీ20ల నుంచి దూరమవుతూ ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితమైన రోహిత్, కోహ్లీ (RO-KO) లు వన్డే క్రికెట్‌లో కొనసాగుతారా లేదా అన్న చర్చలు ఇటీవల బాగా హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా టీమిండియా కొత్త తరం ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు ఇస్తుండటంతో బోర్డు యువతకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉందని వార్తలు వచ్చాయి.
అయితే సీనియర్ల ఫిట్‌నెస్, ప్రదర్శనను నిర్ధారించుకునే ఉద్దేశ్యంతో బీసీసీఐ ఈ కొత్త నిబంధనను విధించింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక జరగనున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ (RO-KO) ఆడాలని బోర్డు సూచించినట్లు సమాచారం.

రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించాడు
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ప్రకారం బీసీసీఐ ఆదేశాలకు రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో ఆడేందుకు తాను అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కు సమాచారం ఇచ్చాడు.
అయితే, విరాట్ కోహ్లీ మాత్రం తన లభ్యతపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.”భారత జట్టుకు ఆడాలనుకుంటే దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిందేనని బోర్డు, జట్టు యాజమాన్యం వారిద్దరికీ తెలియజేశాయి. రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినందున, ఫిట్‌గా ఉండేందుకు ఇది తప్పనిసరి” అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత
రోహిత్ శర్మ నిబద్ధత ఎంతలా ఉందంటే, నవంబర్ 26న ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో ఆడేందుకు కూడా తాను సిద్ధమేనని ఎంసీఏకు తెలిపాడని సమాచారం.గతంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) లో ఓటమి తర్వాత కూడా బీసీసీఐ ఇలాంటి ఆదేశాలే జారీ చేయగా, కోహ్లీ, రోహిత్ చెరొక రంజీ మ్యాచ్ ఆడారు.
ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని మరోసారి అదే విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడటం చాలా ముఖ్యమని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఇటీవలే పునరుద్ఘాటించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆటలో పదును తగ్గకుండా ఉండేందుకు ఇది ఏకైక మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: