భారత క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప క్షణం చోటుచేసుకుంది. దిగ్గజ బ్యాట్స్‌మన్ Sunil Gavaskar కు బీసీసీఐ అరుదైన గౌరవం అందించింది.గురువారం, ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ‘10,000 గవాస్కర్’ పేరిట ఓ ప్రత్యేక బోర్డు రూమ్‌ను ప్రారంభించారు. ఈ గదిని పూర్తిగా గవాస్కర్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించారు.గదినంతా గవాస్కర్ ఫొటోలు, భారత జట్టు విజయాల ట్రోఫీలు అలంకరించబడ్డాయి. అతను ఆడిన కాలాన్ని ప్రతిబింబించేలా అన్నీ నెమలికంటిలా మెరిశాయి.

బీసీసీఐ భావోద్వేగం పంచుకుంది
ఈ ఘనతపై బీసీసీఐ అధికారిక ట్వీట్ చేసింది. “టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా గవాస్కర్‌కి ఇది గౌరవం” అంటూ పేర్కొంది.
సన్నీ స్పందన – భావోద్వేగంతో నిండిన మాటలు
ఈ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ:
“MCA నాకు తల్లి లాంటిది, BCCI తండ్రి లాంటిది,” అన్నారు.
“భారత్ తరఫున ఆడే అవకాశం లభించింది అనేది గర్వకారణం. నన్ను గుర్తించిన దేశానికి రుణపడి ఉంటాను” అని చెప్పారు.అలాగే, “భవిష్యత్తులో బీసీసీఐకి నేను నా వంతు సహాయం చేస్తాను” అన్నారు.

గవాస్కర్ రికార్డులు – ఓ మెరుగైన మైలురాయి
గవాస్కర్ 125 టెస్ట్‌లలో 10,122 పరుగులు చేశారు.
ఆయన సగటు 51 కంటే ఎక్కువ, 34 సెంచరీలు సాధించారు.
వన్డేల్లో కూడా మంచి పరగామే – 108 మ్యాచ్‌ల్లో 3,092 పరుగులు.
క్రమంలో వచ్చిన మరో లెజెండ్ – సచిన్ టెండూల్కర్
గవాస్కర్ టెస్ట్ సెంచరీల రికార్డును తర్వాత సచిన్ టెండూల్కర్ అధిగమించాడు.
ఆయన గౌరవార్థంగా కూడా బీసీసీఐ ‘సచిన్ గది’ ఏర్పరచింది.
ప్రారంభోత్సవానికి ప్రముఖులు హాజరు
ఈ ప్రత్యేక కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని,
ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా,
సెక్రటరీ దేవజిత్ సైకియా పాల్గొన్నారు.
Read Also : IPL 2025: ఆర్‌సీబీ ఈసారి చాలా అద్భుతంగా ఆడుతోంది