కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ వరుస ఓటములతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్న వేళ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ గంభీర్ (Gautam Gambhir) కు పూర్తి మద్దతు ప్రకటించింది.
Read Also: Aus vs Eng: తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ఘన విజయం

మా మద్దతు ఉంటుంది
గంభీర్ కోచింగ్ బృందంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేసింది.ఈ విషయంపై బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) మాట్లాడుతూ, “సెలక్టర్లు, కోచింగ్ సిబ్బంది, హెడ్ కోచ్, ఆటగాళ్లపై బీసీసీఐకి పూర్తి నమ్మకం ఉంది. వారికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది.
ఒక్క ఓటమి రాగానే సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సరికాదు.అలాంటి వాటిని మేము పట్టించుకోము. ఇదే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) గెలిచింది, ఆసియా కప్‌లో (Asia Cup) అదరగొట్టింది, ఇంగ్లాండ్‌లో సిరీస్ సమం చేసింది” అని గుర్తు చేశారు.
BCCI ఎప్పుడు ప్రారంభించబడింది?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 1928 డిసెంబర్ 4న స్థాపించబడింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: