BCCI recruitment 2026 : భారత క్రికెట్‌ను క్షేత్రస్థాయి నుంచే మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో Board of Control for Cricket in India కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కోసం పలు కోచింగ్, పెర్ఫార్మెన్స్ సంబంధిత పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ నియామకాల ద్వారా దేశవ్యాప్తంగా హై-పెర్ఫార్మెన్స్ క్రికెట్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడమే ప్రధాన ఉద్దేశమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇందులో రెండు బ్యాటింగ్ కోచ్ పోస్టులు ఉన్నాయి. జాతీయ సీనియర్ జట్టు నుంచి వయో విభాగాల జట్లు, రాష్ట్ర అసోసియేషన్ ఆటగాళ్ల వరకు బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుంది. హెడ్ క్రికెట్ కోచ్, జాతీయ కోచ్‌లు, సెలక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక శిక్షణా ప్రణాళికలను అమలు చేయాల్సి ఉంటుంది.
అలాగే మూడు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ పోస్టులను కూడా భర్తీ చేయనుంది. ఫాస్ట్ బౌలర్ల సాంకేతిక, వ్యూహాత్మక, శారీరక అభివృద్ధితో పాటు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ప్రతిభావంతుల గుర్తింపులో ఈ కోచ్‌లు కీలక పాత్ర పోషించనున్నారు.
Read Also: Nellore SP Ajitha Vejendla: ఎస్పీకి వినతుల వెల్లువ
ఇక నాలుగు ఫీల్డింగ్ కోచ్ పోస్టులు ఉన్నాయి. వీటిలో మూడు పురుషులకు, (BCCI recruitment 2026) ఒకటి మహిళలకు కేటాయించారు. ఆటగాళ్ల ఫీల్డింగ్ నైపుణ్యాలు, చురుకుదనం, క్యాచ్‌లు పట్టే విధానం, త్రోయింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే వీరి ప్రధాన బాధ్యత. దీనితో పాటు ఒక పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టును కూడా భర్తీ చేయనున్నారు. మ్యాచ్ విశ్లేషణ, శిక్షణ డేటా, స్పోర్ట్స్ సైన్స్ సమాచారాన్ని ఉపయోగించి ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుదలకు అవసరమైన వ్యూహాలను రూపొందిస్తారు.
ఈ అన్ని పోస్టులు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రంగా పనిచేస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవనున్నట్లు తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: