భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI) అధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ రేసులో కొన్ని ప్రముఖుల పేర్లు వినిపిస్తుండగా, తాజాగా పూర్తిగా ఊహించని ఒక మలుపు తిరిగింది. మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మిథున్ మన్హాస్ (Mithun Manhas) పేరు ఇప్పుడు ఈ కీలక పదవికి సీరియస్‌గా పరిశీలనలో ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
గత వారం చివర్లో బీసీసీఐకి చెందిన పలువురు ముఖ్య నిర్ణయాధికారులు, రాష్ట్ర సంఘాల ప్రతినిధులు ఒక అనధికారిక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మిథున్ మన్హాస్ అభ్యర్థిత్వం ప్రధానంగా చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది. బోర్డు భవిష్యత్ దిశ, సమతుల్య నిర్వహణ, రాష్ట్ర సంఘాల మధ్య సఖ్యత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక సమన్వయ అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచన అక్కడ వ్యక్తమైందని తెలుస్తోంది.
కోచ్‌గా పలు బాధ్యతలు చేపట్టారు
45 ఏళ్ల మిథున్ మన్హాస్ దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌కు మారి, అక్కడ ఆటగాడిగా, కోచ్‌గా పలు బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో క్రికెట్ (Cricket) పై ఆయనకు ఉన్న పట్టు, ప్రశాంత స్వభావం వంటివి ఆయన అభ్యర్థిత్వానికి బలాన్ని చేకూరుస్తున్నాయని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.

గతంలో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), రోజర్ బిన్నీ వంటి మాజీ క్రీడాకారులు బీసీసీఐ అధ్యక్షులుగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మన్హాస్ ఎన్నికైతే, వారి సరసన చేరిన మరో మాజీ క్రికెటర్ అవుతాడు. ఆటగాళ్లకు పరిపాలనలో పెద్దపీట వేయాలనే ధోరణికి ఇది అద్దం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా
ఈ ఏడాది ఐసీసీ (ICC) ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడి ఎంపిక ప్రపంచ క్రికెట్‌లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదిలా ఉండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలకమండలి ఛైర్మన్‌గా అరుణ్ ధుమాల్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా (Rajiv Shukla) తమ పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది.
ఈ నెల 23న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అవసరమైతే, ఈ నెల 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఓటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్ర యూనిట్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే, ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: