BCCI Awards 2026: టీమిండియా మాజీ హెడ్ కోచ్, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ మరో అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. మార్చి 15న ఢిల్లీలో జరగనున్న బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో ద్రవిడ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆయన కోచింగ్‌లో టీమిండియా 2023 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌గా, 2024 టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచి చారిత్రక ఘనత సాధించింది.
Read Also: Jitesh Sharma: టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై స్పందించిన జితేశ్ శర్మ
శుభ్‌మన్ గిల్‌కు ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’
ప్రస్తుత భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ప్రదర్శనకు గానూ ‘పాలి ఉమ్రీగర్’ (క్రికెటర్ ఆఫ్ ది ఇయర్) అవార్డుకు ఎంపికయ్యారు. గత ఏడాది కాలంగా మూడు ఫార్మాట్లలో గిల్ చూపిన స్థిరత్వం అతడిని ఈ అవార్డుకు అర్హుడిని చేసింది. యువ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్న గిల్‌కు ఇది పెద్ద గుర్తింపు అని చెప్పవచ్చు.

మిథాలీరాజ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్
మహిళా క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ముద్ర వేసిన మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోనున్నారు. భారత మహిళల క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన ఆమె సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్, మిథాలీరాజ్ వంటి దిగ్గజాలు ఒకే వేదికపై ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: