ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ (AUS vs ENG) మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది.టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో (AUS vs ENG) ఆసీస్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 73 ఓవర్లలో 6 వికెట్లకు 378 పరుగులు చేసింది. జేక్ వెదరాల్డ్(78 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 72), మార్నస్ లబుషేన్(78 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 65), స్టీవ్ స్మిత్(85 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించాడు.
Read Also: Google: 2025లో అత్యధికంగా శోధించిన టాపిక్స్
ట్రావిస్ హెడ్(43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), కామెరూన్ గ్రీన్(57 బంతుల్లో 7 ఫోర్లతో 45) మరోసారి దూకుడుగా ఆడాడు. అలెక్స్ క్యారీ(45 బంతుల్లో 5 ఫోర్లతో 46 బ్యాటింగ్)తో పాటు మైఖేల్ నేజర్(15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/113) మూడు వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్(2/93) రెండు వికెట్లు పడగొట్టాడు.జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీసాడు. ప్రస్తుతం ఆసీస్ 44 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తొలి టెస్ట్‌లో ఆసీస్ విజయం
వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆసీస్ దూకుడుగా ఆడింది. 5.17 రన్‌రేట్‌తో వేగంగా పరుగులు రాబట్టింది. మూడో రోజు ఆటలో తొలి సెషన్ మొత్తం ఆడినా ఆసీస్ ఆధిక్యం 150 పరుగులకు చేరుతుంది. అప్పుడు మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది. తొలి టెస్ట్‌లో ఆసీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.అంతకుముందు 325/9 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేసింది.
ఓవర్‌నైట్ స్కోర్‌కు 9 పరుగులు మాత్రమే జోడించింది. జోఫ్రా ఆర్చర్‌ను బ్రెండన్ డగ్గెట్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. జోరూట్(206 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 138 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. జాక్ క్రాలీ(76) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(6/75) ఆరు వికెట్లు తీయగా.. మైఖేల్ నేజర్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డగ్గొట్ తలో వికెట్ తీసారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: