हिन्दी | Epaper
మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

Latest News: Asia Cup 2025: వారి వల్లే ఈ ఓటమి: శ్రీలంక కెప్టెన్

Anusha
Latest News: Asia Cup 2025: వారి వల్లే ఈ ఓటమి: శ్రీలంక కెప్టెన్

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) లో భాగంగా జరిగిన సూపర్-4 చివరి మ్యాచ్‌ నిజంగా రక్తికట్టే ఉత్కంఠ రేపింది. టీమిండియా, శ్రీలంక జట్లు శుక్రవారం ఆడిన ఈ పోరులో ప్రతి క్షణం ఊపిరి బిగపట్టేలా చేసింది. ఆఖరి వరకు ఎవరు గెలుస్తారో ఊహించలేని ఈ పోరులో చివరికి టీమిండియా సూపర్ ఓవర్ ద్వారా ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ మొత్తం పాటు ఆటగాళ్ల ప్రదర్శన, మలుపులు అభిమానులను ఉత్సాహంతో ఉక్కిరి బిక్కిరి చేశాయి.

 ICC : హరీస్ రౌఫ్‌, సూర్యకుమార్‌కు ఐసీసీ జరిమానా

ఓటమిపై స్పందించిన చరిత్ అసలంక

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన చరిత్ అసలంక (Charit Asalanka).. తమ ఓపెనర్, సెంచరీ హీరో పాతుమ్ నిస్సంకపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా నిస్సంక తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ‘ఇదో అద్భుతమైన మ్యాచ్. వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్‌లు వచ్చి మిడిల్ ఓవర్లు వేసే వరకు ఈ మ్యాచ్‌లో మేం పై చేయి సాధించాం. నిస్సంక బ్యాటింగ్ అసాధారణం. భారత జట్టుకు అత్యంత అనుభవమైన గొప్ప బౌలర్లు ఉన్నారు.

అలాంటి వారిపై నిస్సంక నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం చూడముచ్చటగా అనిపించింది. సూపర్ ఓవర్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని చెప్పాను(నవ్వుతూ). కానీ అలా జరగలేదు. ఈ ఆసియా కప్‌ (Asia Cup) లో ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. దురదృష్టవశాత్తు గత రెండు మ్యాచ్‌ల్లో గెలవలేకపోయాం. ఓ కెప్టెన్‌గా.. తీసుకోవడానికి ఈ టోర్నీలో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి.’అని పాతుమ్ నిస్సంక చెప్పుకొచ్చాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ (Tilak Verma)(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా..

సంజూ శాంసన్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 39), అక్షర్ పటేల్ (15 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ, దుష్మంత్ చమీర, వానిందు హసరంగ, డసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీసారు.

సెంచరీతో చెలరేగగా

అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులే చేసింది. పాతుమ్ నిస్సంక(58 బంతుల్లో7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. కుశాల్ పెరీరా(32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. డసన్ షనక(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా,

కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. సూపర్ ఓవర్‌లో శ్రీలంక 2 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోగా.. భారత్ తొలి బంతికే మూడు పరుగులు చేసి గెలుపొందింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870