ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నీలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన ఫైనల్ మ్యాచ్ చివరికి ప్రారంభమైంది. ఇండియా – పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరాటం ఎప్పుడూ ప్రత్యేకమే. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తెలిపాడు.
‘మేం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాం. ఇది మంచి వికెట్‌లా కనిపిస్తోంది. రాత్రి లైట్ల కింద పిచ్ మరింత మెరుగవుతుంది. మేం గత మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేశాం. కానీ ఈ రోజు లక్ష్యాన్ని చేధించేందుకు ప్రయత్నిస్తాం.
Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్..సెల్ఫీ స్టిక్, టపాసులపై నిషేధం?
పిచ్ తయారీ విషయంలో ఇక్కడి గ్రౌండ్స్‌మెన్ అద్భుతంగా పని చేశారు. గత 5-6 మ్యాచ్‌ల్లో మేం అద్భుతమైన క్రికెట్ ఆడాం. దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈ మ్యాచ్ ఆడటం లేదు. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి రాగా.. శివమ్ దూబే, జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చారు.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తాము సంతోషంగా ఉన్నామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Captain Salman Ali Agha) తెలిపాడు. ‘ఈ మ్యాచ్ కోసం మేం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ మ్యాచ్ కోసం ఎదురు చూశాం. మేం ఇంత వరకు ఒక గొప్ప మ్యాచ్ ఆడలేదు. కానీ ఈ రోజు ఆడుతామని ఆశిస్తున్నాం. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
మేం ఈ పిచ్‌లపై కొంత కాలంగా ఆడుతున్నాం. ఇది కూడా అలానే ఉంటుందని భావిస్తున్నాం.’అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్),
శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.పాకిస్థాన్ : సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
Read hindi news: hindi.vaartha.com
Read Also: