ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టు ఓటమి తర్వాత ఆ దేశ మాజీ వేగవంత బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు సత్తా చాటుతూ మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి టోర్నీలో ప్రతి దశలోనూ అగ్రగామిగా ఉన్న భారత్, పాకిస్తాన్‌పై ఫైనల్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
Asia Cup 2025: భారత్ ఘనవిజయం – కెప్టెన్ పహల్గాం బాధితులకు అంకితం..
గ్రూప్ దశలో, సూపర్-4లో ఇప్పటికే భారత్ చేతిలో పాక్ ఓడిపోయింది. ఫైనల్లో పాకిస్తాన్ కొంతవరకు గట్టి పోటీ ఇచ్చినా.. చివరికి భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.పాక్ ఓటమి తర్వాత మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమ్ మేనేజ్మెంట్ (Team Management) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. “దురదృష్టవశాత్తూ, ఇది జట్టు సమస్య కాదు. మిడిల్ ఆర్డర్ సమస్య అనేది సరైన ఆటగాళ్లను ఎంపిక చేయని మేనేజ్మెంట్ చేసిన తప్పు.
నేను చెప్పాలంటే, ఇది అర్థరహితమైన కోచింగ్. ఇలాంటి పదాలు వాడినందుకు క్షమించండి, కానీ ఇది అర్థరహితమైన కోచింగ్. మా మ్యాచ్ విన్నర్స్ అయిన హసన్ నవాజ్, సల్మాన్ మీర్జా లాంటి వాళ్లు ఉన్నారు. పరిస్థితి కొంచెం కష్టంగా మారింది. మేము చాలా నిరాశ చెందాం” అని అన్నారు.తన అభిప్రాయాలను ఎప్పుడైనా నిర్భయంగా చెప్పే షోయబ్ అక్తర్ (Shoaib Akhtar).. పాకిస్తాన్ ఓటమి తర్వాత సరిగా మాట్లాడలేకపోయారు.

అక్తర్ ఇంకా మాట్లాడుతూ..
ఆయన స్వరం తడబడింది. ఓ విషయాన్ని పూర్తిగా చెప్పకముందే మరో విషయం గురించి మాట్లాడటం ప్రారంభించారు. అక్తర్ ఇంకా మాట్లాడుతూ.. “ఇది సూపర్ సండే, దేశమంతా చూస్తోంది. మా మిడిల్ ఆర్డర్ (Middle order) లో ముందు నుంచే సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసు, మాకు తెలుసు, అందరూ ఇదే చెబుతున్నారు” అని తన నిరాశను వ్యక్తపరిచారు.మొదట కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి పాకిస్తాన్‌ను 19.1 ఓవర్లలో 146 పరుగులకే పరిమితం చేశారు.
ఒకానొక సమయంలో పాకిస్తాన్ స్కోరు ఒక వికెట్‌కు 113 పరుగులుగా ఉన్నప్పుడు.. అది 180 పరుగులు దాటుతుందని భావించారు. ఆ తర్వాత, భారత్ బ్యాటింగ్‌లో కూడా 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆ తర్వాత తిలక్ వర్మ (Tilak Verma) అజేయమైన అర్ధ సెంచరీతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఆయన సంజూ శాంసన్‌తో కలిసి 57 పరుగులు, శివమ్ దూబేతో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: