ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో కీలక మలుపు తిరిగింది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు సమష్టిగా రాణించి శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్ బరిలో నిలబడే అవకాశాలను మరింత బలపరచుకుంది. మరోవైపు, శ్రీలంకకు మాత్రం పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇకపై అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు టోర్నీలో ముందుకు వెళ్లే అవకాశం లేదు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక (Sri Lanka) నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది.
కామిందు మెండిస్(44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ చరిత్ అసలంక (Captain Charith Asalanka)(20)తో పాటు కుశాల్ మెండీస్(0), డసన్ షనక(0), పాతుమ్ నిస్సంక(8) తీవ్రంగా నిరాశపర్చారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/28) మూడు వికెట్లు తీయగా.. హరీస్ రౌఫ్(2/37), హుస్సేన్ తలత్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు.

పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి
అబ్రర్ అహ్మద్ (Abrar Ahmed) ఒక వికెట్ తీసాడు.అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి 12 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. హుస్సేన్ తలత్(30 బంతుల్లో 4 ఫోర్లతో 32 నాటౌట్), మహహ్మద్ నవాజ్(24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ(2/24), వానిందు హసరంగా(2/27) రెండేసి వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా(1/31) ఒక వికెట్ పడగొట్టాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: