हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: భారత్‌ను ఓడించాలంటే అతన్ని ఔట్ చేయాలి: షోయబ్ అక్తర్

Anusha
Latest News: Asia Cup 2025: భారత్‌ను ఓడించాలంటే అతన్ని ఔట్ చేయాలి: షోయబ్ అక్తర్

ఆసియా కప్ 2025  (Asia Cup 2025) టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు మళ్లీ తలపడబోతున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఫైనల్‌కు చేరడం ఖరారు అయింది. ఆదివారం జరుగనున్న ఈ భారీ ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టు చాంపియన్‌గా నిలుస్తుందో నిర్ణయమవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, పాకిస్థాన్ రెండు సార్లు తలపడ్డాయి.

మొదటి మ్యాచ్‌లో భారత్‌ ప్రత్యర్థిని 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. అందువల్ల, మూడవసారి ఇరు జట్లూ ఫైనల్‌ (final) లో ఎదుర్కోవడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.

IND vs SL: నేడే భారత్, శ్రీలంక మ్యాచ్

ఆసియా కప్ చరిత్రలోనే భారత్, పాక్‌లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఫైనల్లో భారత్‌ను ఓడిస్తామని పాకిస్థాన్ ఆటగాళ్లు సవాల్ విసిరారు. దాంతో ఈ మ్యాచ్‌పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత్‌ను ఓడించడం పాకిస్థాన్‌కు చాలా కష్టమని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) అన్నాడు.

Asia Cup 2025
Asia Cup 2025

అయితే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ను త్వరగా ఔట్ చేస్తే భారత్‌ను ఓడించవచ్చని పాక్ ఆటగాళ్లకు సూచించాడు. ‘భారత్‌తో మ్యాచ్ అనగానే ఒత్తిడికి గురయ్యే మైండ్‌‌సెట్ నుంచి పాకిస్థాన్ ఆటగాళ్లు బయటకు రావాలి. బంగ్లాదేశ్‌పై ఎలా ఆడారో అలాగే భారత్‌ను ఓడించాలి. మొత్తం 20 ఓవర్లూ బౌలింగ్ చేయకుండా..

10 వికెట్లు తీసేందుకు ప్రయత్నించాలి

10 వికెట్లు తీసేందుకు ప్రయత్నించాలి.ముఖ్యంగా అభిషేక్ శర్మను తొలి మూడు ఓవర్లలోనే ఔట్ చేయాలి. అప్పుడే భారత్‌పై ఒత్తిడి పెట్టవచ్చు. భారత్‌కు ఇప్పటి వరకు వచ్చిన ఆరంభాలన్నీ అభిషేక్ శర్మ అందించినవే. అభిషేక్ శర్మను ఔట్ చేయకపోతే మాత్రం పాకిస్థాన్‌ గెలవడం కష్టం. అభిషేక్ తప్పిదం చేయడం కూడా చాలా తక్కువ.

కాబట్టి అతనిపై అటాకింగ్ బౌలింగ్ (Bowling) చేయాలి. అప్పుడే మిగతా భారత్ బ్యాటర్లు ఆచితూచి ఆడేందుకు ప్రయత్నిస్తారు. పరుగుల కోసం కష్టపడుతారు.అయితే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Head Coach Gautam Gambhir) ఉన్నాడు. పాక్‌పై టాప్ క్లాస్ ఆటను ఆడాలని భారత్‌కు చెబుతాడు. చెత్త జట్టుతో దిగినా.. నాసికరంగా ఆడినా.. పాక్ ఫైనల్ చేరుకుంది. తుదిపోరులో మాత్రం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తారని భావిస్తున్నా.’అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870