ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్‌లో టీమిండియా (Team India) పాకిస్థాన్ పై సాధించిన విజయం భారత క్రీడా చరిత్రలో ఒక మలుపు తిప్పిన ఘట్టంగా నిలిచింది. భారత జట్టు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, పోరాట స్పూర్తి దేశవ్యాప్తంగా ప్రజలను ఆహ్లాదపరిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తిలక్ వర్మ (Tilak Verma)అద్భుతంగా ఆడాడు. 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజు శాంసన్- 24, శివం దూబే-33 తో కలిసి భారీ ఇన్నింగ్ నిర్మించడంతో గెలుపు ఖాయమైంది.
Asia Cup 2025: రన్నరప్ చెక్కును విసిరేసిన పాకిస్థాన్ కెప్టెన్
ఈ చారిత్రక గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారత జట్టు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తిపై సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) భారత జట్టును అభినందిస్తూ, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (Tilak Verma) ను ప్రత్యేకంగా కొనియాడారు.సోమవారం సోషల్ మీడియా వేదికగా చిరంజీవి తన స్పందనను తెలియజేశారు.
“ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఎంతటి అద్భుత విజయం ఇది. టీమిండియా పోరాట స్ఫూర్తి, నైపుణ్యం, సంయమనం ప్రదర్శించింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మకు అభినందనలు. ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణం. జై హింద్” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
సినీ తారలు కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు
అలాగే, ఇంకా పలువురు సినీ తారలు కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ (Mammootty, Mohanlal) భారత జట్టు ప్రదర్శనను కొనియాడారు. “టీమిండియా కేవలం ఆసియా కప్ గెలవడమే కాదు, దానిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ఒక్క ఓటమి కూడా లేకుండా ఛాంపియన్లుగా నిలిచింది” అని మమ్ముట్టి పేర్కొన్నారు. యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ కూడా తిలక్ వర్మను ప్రశంసిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. కాగా, పాకిస్థాన్‌పై టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: