हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Asia Cup 2025: యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ

Anusha
Latest News: Asia Cup 2025: యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ

ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో టీమిండియా యువ స్టార్ అభిషేక్ శర్మ  (Abhishek Sharma)ప్రదర్శన అభిమానులను ఆశ్చర్యంలో పడేస్తోంది. గతంలో పాకిస్తాన్ జట్టుపై సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో క్రికెట్ విశ్లేషకులను షాక్ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్‌లో కూడా అతను సునామీ వంటి ఇన్నింగ్స్ ఆడుతూ జట్టు విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ వేగవంతమైన ఇన్నింగ్స్ ఆయనను ప్రత్యేకమైన ఎలైట్ క్లబ్లోకి చేరవేసింది. ఈ క్లబ్‌లో టీమిండియాకు చెందిన ప్రముఖ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఇప్పటికే ఉన్నారు. అంటే, అభిషేక్ శర్మ ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక గ్రూప్‌లో మాస్టర్ ప్లేయర్‌లతో పాటు ఆడే ప్రతిభావంతులుగా నిలిచాడు.

Abhishek’s sister Komal Sharma:యువరాజ్ సింగ్ గైడెన్స్ తో అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన

యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు

ఈ క్రమంలో తన గురువుగా భావించే దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)పేరిట ఉన్న ఒక అరుదైన T20I రికార్డును అభిషేక్ శర్మ అధిగమించాడు. కేవలం 25 బంతుల్లో మరోసారి హాఫ్ సెంచరీ సాధించి, ఏకంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వంటి స్టార్లతో కూడిన ఎలైట్ క్లబ్‌లో చేరాడు.

Asia Cup 2025
Asia Cup 2025

అభిషేక్ శర్మ తన ఐదో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో టీమిండియా(Team India)లోని అత్యంత వేగవంతమైన బ్యాటర్ల ఎలైట్ జాబితాలో చేరాడు. ఈ జాబితాలో ప్రస్తుతం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏడు సార్లు చేసి అగ్రస్థానంలో ఉండగా, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)ఆరుసార్లు ఈ ఘనత సాధించాడు. అభిషేక్ శర్మ (5) ఇప్పుడు యువరాజ్ సింగ్ (4) కేఎల్ రాహుల్ (3) కంటే ముందు స్థానంలో ఉన్నాడు.

ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌

ఈ గణాంకాలు టీ20 ఫార్మాట్‌ (T20 format)లో అభిషేక్ ఎంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌గా మారుతున్నాడో తెలియజేస్తున్నాయి.అంతకుముందు, పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ ఒక రికార్డును బద్దలు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి, చిరకాల ప్రత్యర్థిపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు.

ఆ ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేసిన అభిషేక్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ తర్వాత పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు.బంగ్లాదేశ్‌పై కూడా అభిషేక్ తన జోరును కొనసాగించాడు. వైస్-కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)తో కలిసి 77 పరుగుల అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 75 పరుగుల వద్ద అతడు రనౌట్ అయ్యాడు.

సెంచరీ కొట్టగానే దుబాయ్‌లోని స్టాండ్స్‌

ఈ స్కోరు (75) పాకిస్తాన్‌పై చేసిన స్కోరు (74)కు దాదాపు సమానంగా ఉండటం విశేషం.అభిషేక్ ఆటతీరుతో పాటు, అతడి సెలబ్రేషన్ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్‌పై లవ్ ను సూచించే L సైన్ చూపించిన తర్వాత, బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ కొట్టగానే దుబాయ్‌లోని స్టాండ్స్‌ వైపు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. వెంటనే కెమెరాలు అతని సోదరి కోమల్ శర్మ (Komal Sharma)వైపు మళ్లాయి. ఆమె తన సోదరుడి మైలురాయిని గర్వంగా మొబైల్‌లో రికార్డ్ చేస్తూ కనిపించింది. ఈ స్పెషల్ సెలబ్రేషన్ ఆమె కోసమే అని తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870