భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఇంట త్వరలో శుభకార్యం జరగనుంది. సచిన్ టెండూల్కర్, కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, వ్యాపారవేత్త అయిన సానియా చందోక్‌ను ఆయన వివాహం చేసుకోనున్నాడు. కొంతకాలంగా వీరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ, తాజాగా వివాహ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో వీరి వివాహ వేడుక జరగనుంది.
Read Also: Keshineni Chinni: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంటార్‌గా మిథాలీ రాజ్
తాజాగా వచ్చిన కథనాల ప్రకారం వీరి పెళ్లి వేడుకలు మార్చి 3న ప్రారంభమై, 5న ముంబైలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, కొద్దిమంది క్రికెటర్ల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. వాస్తవానికి అర్జున్, సానియా నిశ్చితార్థం గత ఏడాది ఆగస్టులోనే అత్యంత రహస్యంగా జరిగింది.

సానియా చందోక్ గురించి
ఇటీవలే అర్జున్ నిశ్చితార్థాన్ని సచిన్ టెండూల్కర్ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. సానియా చందోక్.. అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) సోదరి సారా టెండూల్కర్‌కు క్లోజ్ ఫ్రెండ్. సారా ద్వారానే సానియా అర్జున్‌కు పరిచమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో వివాహం జరిపించేందుకు సిద్దమయ్యారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన సానియా.. ప్రముఖ పెట్ కేర్ బ్రాండ్ అయిన ‘మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీ’కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ పెంపుడు జంతువులను అందంగా తీర్చిదిద్దుతోంది. ముంబైకి చెందిన సెలెబ్రిటీలు సానియాకు కస్టమర్లు. సారా టెండూల్కర్, సానియా మంచి స్నేహితులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: