భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను మళ్లీ నిరూపించాడు. జెరుసలేం మాస్టర్స్–2025 (Jerusalem Masters 2025) టోర్నమెంట్ ఫైనల్‌లో భారత లెజెండరీ గ్రాండ్‌మాస్టర్, మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌పై అద్భుత విజయంతో అర్జున్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
Read Also: Mohit Sharma: అన్ని ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మోహిత్ శర్మ

బ్లిట్జ్ గేమ్‌లో విజయం
(Jerusalem Masters 2025) ఈ విజయం అతని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: