ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ (Alyssa Healy) రిటైర్మెంట్ ప్రకటించారు. మార్చిలో టీమ్ ఇండియాతో జరగబోయే హోమ్ సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతానని వెల్లడించారు. 16 ఏళ్ల పాటు సాగిన గొప్ప క్రికెట్ ప్రయాణానికి ఇదే సరైన ముగింపు అని హీలీ స్పష్టం చేసింది. కొద్ది నెలలుగా తన రిటైర్మెంట్ పై ఆలోచిస్తున్నానని చెప్పింది. ఎన్నో ఏళ్లుగా అత్యున్నత స్థాయిలో ఆడానని, ఇప్పుడు తనలోని పోటీతత్వం కాస్త తగ్గినట్టు అనిపించిందని హీలీ నిజాయితీగా వెల్లడించింది.
Read also: Shikhar Dhawan Engagement : ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

భారత్ తో, జరిగే సిరీస్ నా కెరీర్లో చివరిది
మంగళవారం ‘విల్లో టాక్’ పోడ్కాస్ట్ లో, 35 ఏళ్ల హీలీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. ‘భారత్ తో, జరిగే సిరీస్ నా కెరీర్లో చివరిదని చెపుతున్నందుకు చాలా భావోద్వేగంగా ఉంది.ఆస్ట్రేలియా తరపున ఆడాలనే తపన నాలో ఇంకా ఉంది. కానీ కెరీర్ ఆరంభం నుంచి నన్ను ముందుకు నడిపించిన దూకుడు, పోటీ తత్వం ఇప్పుడు కాస్త తగ్గింది. అందుకే రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం అనిపించింది.
రిటైర్మెంట్ పై చాలా ఆలోచించా. గత కొన్ని సంవత్సరాలు శారీరకంగా, మానసికంగా అలసిపోయా. గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. ఇంతకు ముందు లాగ ఆ శక్తిని తిరిగి తెచ్చుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది’ అని అలీసా హీలీ చెప్పింది. హీలీ తన కెరీర్ ను దాదాపు 300 అంతరాతీయ మ్యాచ్లతో ముగించనుంది. అన్ని పార్శాటలో కలిపి 7.000కుపైగా పరుగులు చేసింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: