మహిళల వన్డే వరల్డ్ కప్‌ను ఓటమితో ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు మరో భారీ దెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికాతో జరగబోయే రెండో మ్యాచ్‌కు ముందు ఆల్‌రౌండర్ ఫ్లోరా డెవాన్‌షైర్ (Flora Devonshire) గాయపడి టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ వార్త న్యూజిలాండ్ (New Zealand) అభిమానులకు షాక్ ఇచ్చింది. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌లోనే టీమ్ దారుణ పరాభవాన్ని చవిచూసిన తర్వాత, ఫ్లోరా లాంటి ప్రతిభావంతురాలిని కోల్పోవడం జట్టుకు పెద్ద నష్టం అని చెప్పాలి.
Rohit Sharma: వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగింపు పై హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే?
ఆమెను పరీక్షించిన వైద్యులు కోలుకునేందుకు కనీసం రెండు నుంచి మూడు వారాలు సమయం పడుతుందని తెలిపారు. దాంతో.. ఫ్లోరా స్థానంలో సీనియర్ క్రికెటర్ హన్నా రొవే (Hannah Rowe))ను ఎంపిక చేశారు సెలెక్టర్లు.నిరుడు టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ అయిన న్యూజిలాండ్ వన్డే వరల్డ్ కప్‌ను పట్టేయాలనే లక్ష్యంతో భారత్‌కు వచ్చింది.
కానీ, తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా చేతిలో 89 పరుగుల తేడాతో వైట్ ఫెర్న్స్ ఓటమి చవిచూసింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఆల్‌రౌండర్ ఫ్లోరా (All-rounder Flora) గాయపడడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే. ఆమె స్థానంలో స్క్వాడ్‌లోకి వచ్చిన మాత్ హన్నా రొవేకు ఇది మూడో వరల్డ్ కప్.
తను వరల్డ్ కప్ ఆడడం కోసం చాలా కష్టపడింది.
పేస్ ఆల్‌రౌండర్ అయిన ఆమెకు 60 వన్డేలు ఆడిన అనుభవం ఉంది.‘మేమందరం ఫ్లోరా వైదొలగడంతో చాలాబాధ పడుతున్నాం. తను వరల్డ్ కప్ ఆడడం కోసం చాలా కష్టపడింది. అవకాశం లభించిందనే సంతోషంలో ఉన్న తను గాయపడడంతో ఆరంభంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది’ అని హెడ్‌కోచ్ బెన్ సాయెర్ వెల్లడించింది.న్యూజిలాండ్ స్క్వాడ్ : సోఫీ డెవినె(కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, హన్నా రొవే, ఇజీ గాజే, మ్యాడీ గ్రీన్, బ్రూకే హల్లిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, బెల్లా జేమ్స్, మేలీ కేర్, జెస్ కేర్, రోస్‌మెరీ మేర్, జార్జియా ప్లిమ్మెర్, లీ తహుహ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: