ప్రపంచ టెన్నిస్ రంగం (World tennis Sector) లో తన ప్రతిభ, సామర్థ్యం ద్వారా ప్రతి మ్యాచ్‌లో అభిమానులను కట్టిపడేస్తున్న స్టార్ క్రీడాకారుడు కార్లొస్ అల్కరాజ్ (Carlos Alcaraz) మరో మైలురాయిని సాధించాడు. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ టోర్నీ లో అతడు విజేతగా నిలిచాడు. ఈ విజయం ద్వారా అల్కరాజ్ తన కెరీర్‌లో మరొక ATP టైటిల్ (ATP title) ను జోడించుకున్నాడు.
Tilak Varma : ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మకు హైదరాబాద్‌లో అభిమానుల ఘన స్వాగతం

మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో అల్కరాజ్.. 6-4, 6-4తో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్ (Taylor Fritz) ను ఓడించాడు. తద్వారా ఇటీవలే లేవర్ కప్‌లో ఫ్రిట్జ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులుతీర్చుకున్నాడు. స్పెయిన్ (Spain) కుర్రాడికి ఈ ఏడాది ఇది 8వ టైటిల్ కాగా కెరీర్‌లో 24వది కావడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: