గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ మరోసారి అంతర్జాతీయ క్రీడా రంగంలో వెలుగొందనుంది. భారత్ 2030 కామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games) ఆతిథ్య హక్కులు సాధించినట్లు అధికారికంగా వెల్లడించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Minister S. Jaishankar) గురువారం తన ఎక్స్ (Twitter) అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
Read Also: Kane Williamson: ఎల్‌ఎస్‌జీ అడ్వైజర్‌గా కేన్ విలియమ్సన్
భారత్ తరఫున అహ్మదాబాద్ నగరాన్ని 2030 కామన్‌వెల్త్ క్రీడల (2030 Commonwealth Games) వేదికగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇది భారతదేశానికి, గుజరాత్‌కు గర్వకారణమని, ప్రపంచ క్రీడా రంగంలో భారత్ ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ విజన్ నిదర్శనంగా
ఇది భారత దేశానికి, గుజరాత్ (Gujarat) కు గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాల కల్పనకు, క్రీడా టాలెంట్‌ను వెలికి తీసేందుకు ప్రధాని మోదీ విజన్ నిదర్శనంగా పనిచేస్తుందన్నారు.
అయితే 2036లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలనుకుంటున్న భారత్‌కు.. కామన్‌వెల్త్ క్రీడల నిర్వహణ ఓ ప్లాట్‌ఫామ్‌గా నిలిచే అవకాశం ఉన్నది. నవంబర్ 26వ తేదీన స్కాట్‌లాండ్‌లోని గ్లాస్‌గోవ్‌లో జరగనున్న జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో అహ్మదాబాద్ అంశాన్ని పరిశీలించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: