ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటైన కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) తమ సపోర్ట్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం,
జట్టు కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్ (Abhishek Nair) ను నియమించేందుకు ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన తర్వాత BCCI ఆ పదవి నుంచి ఆయనను తొలగించిన సంగతి తెలిసిందే.
Read Also: Sunil Gavaskar: ఆసీస్ మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. గవాస్కర్ తీవ్ర ఆగ్రహం
ఆ తరువాత అభిషేక్ నాయర్ మళ్లీ KKR సపోర్ట్ స్టాఫ్‌లో చేరి జట్టుకు మెంటోరింగ్, స్ట్రాటజీ ప్లానింగ్, డొమెస్టిక్ ప్లేయర్లను గ్రూమ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయనను అధికారికంగా హెడ్ కోచ్‌గా ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.

కోచింగ్‌లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు
స్థానిక క్రికెట్‌లో మంచి అనుభవం సంపాదించిన నాయర్ (Abhishek Nair), భారత జట్టులో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోయినా, కోచింగ్‌లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మానసిక ధృడత్వం,
వ్యక్తిగత శిక్షణ, ప్రతి ఆటగాడి బలాలు–బలహీనతలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆయన ప్రధాన శైలి. IPLలోనూ యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో నాయర్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది.WPLలో UP వారియర్స్‌కు నాయర్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: