ఆస్ట్రేలియాతో గాలేలో జరగనున్న రెండో టెస్ట్ తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్‌ను వీడనున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ కరుణరత్నేకు 100వ టెస్ట్ మ్యాచ్‌గా కూడా నిలుస్తుంది.ప్రస్తుతం 36 సంవత్సరాల కరుణరత్నే, ఇటీవల బ్యాటింగ్‌లో స్థిరంగా రాణించలేకపోయాడు కాబట్టి క్రికెట్‌ను వీడే నిర్ణయం తీసుకున్నాడు.గత కొంతకాలంగా కరుణరత్నే ఫామ్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు . తన చివరి 7 టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం 182 పరుగులే సాధించాడు. 2024 సెప్టెంబరులో న్యూజిలాండ్‌పై చేసిన అర్ధ సెంచరీ మాత్రమే అతని తాజా అత్యధిక స్కోరు.2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా కరుణరత్నే టెస్ట్ క్రికెట్‌కు పరిచయమైంది.

ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ విజయం శ్రీలంకను 10 వికెట్ల తేడాతో గెలిపించింది.ఆ తరువాత కరుణరత్నే శ్రీలంక టెస్ట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 99 టెస్ట్ మ్యాచ్‌లలో 7,172 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు ఉన్నాయి 2021లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అత్యధిక వ్యక్తిగత స్కోరు 244 రన్న్స్ సాధించాడు.2014లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో తన తొలి సెంచరీ చేశాడు ఆ తరువాత 2015 నుంచి స్థిరంగా రాణిస్తూ, శ్రీలంక జట్టుకు టెస్ట్ ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. 2017లో పాకిస్థాన్‌తో జరిగిన డే-నైట్ టెస్ట్‌లో 196 పరుగులతో తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.2019లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అదే సంవత్సరం, దక్షిణాఫ్రికాపై 2-0 తో టెస్ట్ సిరీస్ గెలిచి, సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించిన మొదటి ఆసియా జట్టుగా శ్రీలంక నిలిచింది కరుణరత్నే 50 వన్డేలు, 34 టీ20లు ఆడాడు.