మెల్‌బోర్న్ టెస్టు క్రమంలో ఆసక్తికర ఘటనల మధ్య, భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ఒక ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. యువ ఆస్ట్రేలియన్ బ్యాటర్ సామ్ కాన్స్టాన్స్, బుమ్రా బౌలింగ్‌పై తన దూకుడు ఆటతీరు చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.బుమ్రా వేసిన ఓ ఓవర్‌లో కాన్స్టన్స్ 18 పరుగులు కొట్టాడు.ఇది బుమ్రా టెస్టు కెరీర్‌లో అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది.అయితే ఈ విమర్శలకు, ప్రశ్నలకు బుమ్రా తట్టుకోలేనట్లుగా, ధీటైన సమాధానం ఇచ్చాడు.మూడో రోజు ఆట సందర్భంగా,జస్ప్రీత్ బుమ్రాను ఆస్ట్రేలియన్ మీడియా సామ్ కాన్స్టన్స్ దూకుడుకు సంబంధించి ప్రశ్నించింది.కాన్స్టన్స్ బౌలింగ్‌ను తిప్పికొట్టడం వల్ల మీకు ఒత్తిడి కలిగిందా అనే ప్రశ్నకు బుమ్రా కోల్డ్ అండ్ కాంపోజ్డ్ గా స్పందించాడు.టీ20 ఫార్మాట్‌లో నాకు పది సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది.చాలా మంది గొప్ప బ్యాటర్లను ఎదుర్కొన్నాను.కాన్స్టన్స్ ఇన్నింగ్స్ కేవలం ఆ రోజు తాత్కాలిక విజయమే.
అతని వికెట్ తీయడం నాకు పెద్ద కష్టం అనిపించలేదు.వాస్తవానికి, మొదటి రెండు ఓవర్లలోనే అతను 6-7 సార్లు ఔట్ అయ్యేవాడు.క్రికెట్‌లో విజయం-విఫలతలు సహజం.నేను ఎప్పుడూ కొత్త సవాళ్లను స్వీకరించడంలో ఆసక్తి చూపుతాను,అని బుమ్రా సమాధానమిచ్చాడు. సామ్ కాన్స్టన్స్, బుమ్రా బౌలింగ్‌లో 33 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఆ ఓవర్లో 18 పరుగులు రాబట్టడం ద్వారా, టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్ బుమ్రాపై అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.అంతేకాక, మూడు సంవత్సరాల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కనిపించాయి. బుమ్రా మాట్లాడుతూ, “క్రికెట్ ఒక అపురూపమైన ఆట. కొన్ని రోజులు మన పైచేయి ఉంటే, మరికొన్ని రోజులు ఎదురుదాడి తప్పదు.కానీ ప్రతి ఛాలెంజ్ నా దృష్టిలో కొత్త పాఠం మాత్రమే. చివరికి విజయం కాకపోయినా,నా ప్రదర్శనలో తృప్తి ఉంటుంది.ఇదే నా ఆటతీరు,” అని పేర్కొన్నాడు. కాన్స్టన్స్ 60 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైకింగ్ బ్యాటింగ్, ముఖ్యంగా బుమ్రాపై కొట్టిన సిక్సర్లు, ఆసక్తి రేకెత్తించాయి.