ఈరోజుల్లో వాట్సాప్ చాట్స్, స్క్రీన్‌షాట్‌లు చాలా వివాదాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వాట్సాప్ స్క్రీన్‌షాట్‌ను నేరుగా కోర్టులో సాక్ష్యంగా అంగీకరిస్తారా అంటే సమాధానం లేదు. భారతీయ సాక్ష్యాల చట్టం (Indian Evidence Act) ప్రకారం డిజిటల్ రూపంలో ఉన్న ఏ సమాచారం అయినా ప్రత్యేక నిబంధనలను పాటించాలి. కేవలం మొబైల్‌లో ఉన్న స్క్రీన్‌షాట్ చూపించడమే సరిపోదు. అది నిజమైనదా, ఎవరైనా మార్చారా, ఎలాంటి డివైస్ నుంచి తీసుకున్నారన్న విషయాలు స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది.
Read also: RBI: ఇకపై వెండి వస్తువులకు కూడా బ్యాంకుల్లో తాకట్టు సదుపాయం

Will the court accept WhatsApp chats as evidence
సెక్షన్ 65B సర్టిఫికేట్ ఎందుకు తప్పనిసరి?
వాట్సాప్ చాట్స్ లేదా స్క్రీన్‌షాట్‌లను కోర్టులో సమర్పించాలంటే సెక్షన్ 65B సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ సర్టిఫికేట్ ద్వారా ఆ డిజిటల్ సాక్ష్యం నిజమైనదని, మార్పులు చేయలేదని, ఉపయోగించిన మొబైల్ లేదా కంప్యూటర్ సరిగా పనిచేసిందని చట్టపరంగా నిర్ధారిస్తారు. ఈ సర్టిఫికేట్ లేకుండా సమర్పించిన స్క్రీన్‌షాట్‌ను కోర్టు సాధారణంగా అంగీకరించదు. అందుకే డిజిటల్ సాక్ష్యాల విషయంలో చట్టపరమైన విధానాలు పాటించడం చాలా ముఖ్యం.
కోర్టులో సాక్ష్యంగా నిలవాలంటే ఏం చేయాలి?
వాట్సాప్ స్క్రీన్‌షాట్ కోర్టులో బలమైన సాక్ష్యంగా నిలవాలంటే సరైన ఫార్మాట్‌లో ప్రింట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన 65B సర్టిఫికేట్‌ను బాధ్యత కలిగిన వ్యక్తి ద్వారా జారీ చేయించాలి. అవసరమైతే ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా స్క్రీన్‌షాట్ ప్రామాణికతను కూడా నిరూపించాలి. ఈ విధంగా అన్ని నిబంధనలు పాటిస్తేనే వాట్సాప్ డిజిటల్ సాక్ష్యం కోర్టులో చెల్లుబాటు అవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: