జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం..!

జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం..!

అమరావతి: పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించనున్న 12వ ఆవిర్భావ సభకు మహిళలను ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆడపడుచులను ఆహ్వానించేలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన బొట్టు స్టిక్కర్లతో కూడిన ఆహ్వాన పత్రికను ఆదివారం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడ కంట్రోల్ రూమ్ లో ఆవిష్కరించారు. పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ఆడపడుచులను ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సభకు ఆహ్వానించనున్నారు.

Advertisements
జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం..!

వీరమహిళ విభాగానికి మనోహర్ దిశానిర్దేశం

ఈ మేరకు చొరవ తీసుకోవాలని పార్టీ వీరమహిళ విభాగానికి మనోహర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు పంతం నానాజీ, మాజీ మంత్రి పడాల అరుణ, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పాలవలస యశస్వి, పార్టీ నాయకురాలు శ్రీమతి రావి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts
Andhra Pradesh: ఏపీకి శుభవార్త త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం ఎక్కడంటే!
Andhra Pradesh: ఏపీకి శుభవార్త త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం ఎక్కడంటే!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కృష్ణా జిల్లా నాగాయలంకలో ఏర్పాటు చేయబోయే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌ను పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారనే వార్తలు Read more

బంగ్లాదేశ్ ట్రిబ్యునల్: షేక్ హసీనా అరెస్టు గురించి పోలీసుల నివేదిక విచారణ
tribunal

బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఈ రోజు పోలీసుల నుంచి నివేదిక తీసుకోనుంది. జులై-ఆగస్టు నెలల్లో జరిగిన నిరసనలపై, అవి నియంత్రించడానికి పోలీసులు తీసుకున్న చర్యల గురించి పోలీసుల సమాచారం Read more

హీరోయిన్ తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్మెంట్
Nara Rohiths Engagement on

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్లో ఆయన ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో Read more

హైదరాబాదీ టాలెంట్‌కు ఫిదా అయినా ఆనంద్ మహీంద్రా
sudhakar cars

ఆనంద్ మహీంద్రా హైదరాబాదీ టాలెంట్ గురించి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సుధాకర్ అనే వ్యక్తి వివిధ ఆకారాలలో కార్లను తయారు చేయడం మరియు ఒక మ్యూజియం Read more

×