speaker ayyannapatrudu anger at Assembly members!

YSRCP : దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు..అసెంబ్లీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం !

Ayyannapatrudu: ఏపి అసెంబ్లీలో సభ్యుల హజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరెవరైనా చూశారా? అంటూ సభ్యులను స్పీకర్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరుకావాల్సి ఉందన్నారు. వైసీపీ సభ్యులు ఎవరికీ కనపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు. అలా వచ్చి వెళ్లడం వారి గౌరవాన్ని పెంచదన్నారు.

Advertisements
దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు అసెంబ్లీ

వీరెవరూ సభకు హాజరు కాలేదు

వైసీపీ సభ్యులు బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్‌, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, దాసరి సుధ తదితరులు సంతకాలు చేసినట్లు తేలిందని స్పీకర్‌ చెప్పారు. గవర్నర్ ప్రసంగం తర్వాత వీరెవరూ సభకు హాజరు కాలేదన్నారు. వేర్వేరు తేదీల్లో వీరు రిజిస్టర్‌లో సంతకాలు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. హాజరుపట్టిలో వారి సంతకాలు ఉన్నా వాళ్లు సభకు వచ్చినట్టు స్పీకర్‌గా తాను గుర్తించలేదన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు తలవంపులు తేవొద్దంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.

ఓట్లేసిన ప్రజలకు తలవొంపులు తెచ్చేలా

గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత.. అంటే ఫిబ్రవరి 24 తేదీ తర్వాత వేర్వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. కానీ వారెవరు నాకు సభలో కనిపించలేదు.. ఇది సమంజసమో వారే నిర్ణయించుకోవాలి. ప్రజలకు ఆదర్శంగా నిలవాలి.. ఓట్లేసిన ప్రజలకు తలవొంపులు తెచ్చేలా ప్రవర్తించకూడదని నా అభిప్రాయం’ అంటూ సభలో అయ్యన్నపాత్రుడు ప్రకటన చేశారు.

Related Posts
కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
pawan kalyan

ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల ప్రక్రియకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కీలక ముందడుగు పడింది. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: రాజగోపాల్ రెడ్డి
నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం రాజగోపాల్ రెడ్డి

నాకు మంత్రి పదవి వస్తే వారికే లాభం: రాజగోపాల్ రెడ్డి ఈరోజుల్లో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ముఖ్యంగా మంత్రి పదవులు, అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధాలు Read more

Venkaiah Naidu : జమిలి ఎన్నికలతో ఎన్నికల ఖర్చు ఆదా : వెంకయ్య నాయుడు
Election expenses will be saved with Jamili elections.. Venkaiah Naidu

Venkaiah Naidu : తిరుపతిలో ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశంపై నిర్వహించిన మేధావుల సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన Read more

కమాండెంట్ గంగారాం మృతిపట్ల కేటీఆర్ సంతాపం
KTR condoles the death of Commandant Gangaram

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, 17వ పోలీసు బెటాలియన్‌ కమాండెంట్‌ గంగారాం (58) మృతిపట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) సంతాపం వ్యక్తం చేశారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×