हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Soya Dum Biryani:సోయా దమ్ బిర్యానీ

Hema
Soya Dum Biryani:సోయా దమ్ బిర్యానీ

Soya Dum Biryani కి ఏం కావాలి?

  • మీలేమేకర్ (సోయా చంక్స్): 1 కప్పు
  • బాస్మతి బియ్యం: 2 కప్పులు
  • ఉల్లిగడ్డ: 1
  • పచ్చిమిర్చి: 4
  • అల్లం: అంగుళం ముక్క
  • అల్లం వెల్లుల్లి పేస్ట్: ½ టీస్పూన్
  • లవంగాలు: 8
  • యాలకులు: 4
  • మరాఠి మొగ్గ: 1
  • దాల్చినచెక్క: 2 అంగుళం ముక్కలు
  • సాజీరా: 2 టీస్పూన్లు
  • బిర్యానీ ఆకులు: 4
  • కారం: 2 టీస్పూన్లు
  • పసుపు, ధనియాలపొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా: తలా 1 టీస్పూన్
  • పెరుగు: ½ కప్పు
  • క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిబఠాణీలు: తలా 2 టేబుల్ స్పూన్లు
  • పుదీనా, కొత్తిమీర తురుము: తలా 1 టేబుల్ స్పూన్
  • వేయించిన ఉల్లిపాయ ముక్కలు: ½ కప్పు
  • నెయ్యి: ½ కప్పు
  • నూనె: 1 టేబుల్ స్పూన్
  • నిమ్మకాయ: 1
  • ఉప్పు: తగినంత
  • ఎండిన గులాబీ రెక్కలు: 1 టేబుల్ స్పూన్
  • రోజ్వాటర్: 1 టీస్పూన్
  • రెడ్ ఫుడ్ కలర్: చిటికెడు

తయారీ విధానం:

మొదట మీలేమేకర్ (సోయా చంక్స్) పది నిమిషాలపాటు వేడినీళ్లలో నానబెట్టి, వాటిని గట్టిగా పిండుకోవాలి. అల్లం మరియు పచ్చిమిర్చిని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని కడిగి, గంటపాటు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో మీలేమేకర్, క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు, పచ్చిబఠాణీలు, కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీర తురుము, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు(curd) మరియు ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి, అరగంటపాటు నానబెట్టాలి.

స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక, టీస్పూన్ సాజీరా, రెండు యాలకులు, నాలుగు లవంగాలు, మరాఠి మొగ్గ, దాల్చినచెక్క ముక్కలు, రెండు బిర్యానీ ఆకులు వేసి వేగించాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ(onion)ముక్కలు వేసి బాగా వేయించాలి. అప్పుడు మునుపు నానబెట్టిన మీలేమేకర్ మిశ్రమాన్ని వేసి, అరగ్లాసు నీళ్లు పోసి సన్నని మంటపై రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

మరో స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో రెండు లీటర్ల నీళ్లు, దాల్చినచెక్క, సాజీరా, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకులు, ఉప్పు, ఎండిన గులాబీ రెక్కలు, నూనె వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత బాస్మతి బియ్యాన్ని వేసి సగానికి పైగా ఉడికించాలి. ఆ తర్వాత ఉడికిన అన్నాన్ని మీలేమేకర్ మిశ్రమం మీద పొరలా వేసి, పైన వేయించిన ఉల్లిపాయ ముక్కలు, రోజ్ వాటర్, పుదీనా, కొత్తిమీర తురుము, రెడ్ ఫుడ్ కలర్ వేసి మూతపెట్టి ఇరవై నిమిషాలపాటు సన్నని మంటపై ఉంచాలి. చివరగా మరో పదినిమిషాలు ఆగి వడ్డిస్తే రుచికరమైన సోయా దమ్ బిర్యానీ సిద్ధం.

Read also:hindi.vaartha.com

Read also: Apple Chips:యాపిల్ చిప్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870