South Korean President Yoon Suk Yeol arrested

దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్ట్

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అధికారులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. దేశంలో అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ఆయన చిక్కులు కొనితెచ్చుకున్నారు. ఇప్పటికే అభిశంసనకు గురి కాగా.. ‘మార్షల్ లా’ విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను యోల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున వందలమంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకోగా.. తొలుత అధ్యక్ష భద్రతా దళాలు వీరిని అడ్డుకున్నాయి. కొంతసేపు ప్రతిష్టంభన నెలకొన్న తర్వాత దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసం లోపలికి వెళ్లి యూన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. గతంలో యోల్‌ను అరెస్ట్ చేసేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు.

image
image

ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. గతేడాది డిసెంబరులో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెను వెంటనే తన ప్రకటనను విరమించుకున్నారు. అయితే, అధ్యక్షుడి నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన అక్కడి ప్రతిపక్షాలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ‘మార్షల్ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు.

దేశంలో ‘మార్షల్ లా’ ఉత్తర్వులు జారీ చేసి సంక్షోభంలోకి నెట్టినందుకు యూన్ సుక్ యేల్‌కు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో విపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి 204 మంది అనుకూలంగా ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆయన అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు, అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో దీనిపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేశారు. వీటికి ఆయన స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. దీంతో బుధవారం తెల్లవారుజామున అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related Posts
కథువాలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
Jammu & Kashmir: Six Killed In Massive Fire At DSP's Home In Kathua

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కథువాలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఊపిరాడక ఆరుగురు చనిపోయారు. మ‌రో నలుగురు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్నారు. Read more

భారతదేశంలో ఎరువుల ఆవిష్కరణకు కోరమాండల్ – ఐఎఫ్‌డీసీ భాగస్వామ్యం
Coromandel - IFDC Partnership for Fertilizer Innovation in India

భారత వ్యవసాయ రంగంలో ఎరువుల ఆవిష్కరణకు మరింత ఊతమిచ్చేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్ డెవలప్‌మెంట్ సెంటర్ (IFDC) వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. డిసెంబర్ Read more

వైఎస్ షర్మిలతో చర్చలు జరిపిన విజయసాయిరెడ్డి
వైఎస్ షర్మిలతో చర్చలు జరిపిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిలను సీనియర్‌ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి కలిశారు . ఈ భేటీ, సియనియర్ నాయకుడు ఇటీవల రాజకీయాలకు దూరంగా Read more

పసిబాలుడి ఉసురు తీసిన కొత్త కారు
పసిబాలుడి ఉసురు తీసిన కొత్త కారు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బల్లియా జిల్లా, ఉభావోన్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది.కొత్త కారుకు పూజ చేసేందుకు కుటుంబం దేవాలయానికి వెళ్లగా, ఏడాదిన్నర వయసున్న చిన్నారి Read more