దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20)లో భాగంగా సెంచూరియన్‌లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై 8 వికెట్ల ఘన విజయం సాధించి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్, 176 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించింది. రేపు (శనివారం) జోహన్నెస్‌బర్గ్‌లో ముంబయి ఇండియన్స్ కేప్ టౌన్ జట్ల మధ్య ఫైనల్ జరుగనుంది.మొదట బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 20 ఓవర్లలో 175/4 స్కోర్ చేసింది. ఆ జట్టులో హెర్మన్ రూబిన్ 81 నాటౌట్ ప్రిటోరియస్ 59 రన్స్ తో మంచి ఇన్నింగ్స్ ఆడారు.

సన్‌రైజర్స్ బౌలర్లలో క్రేగ్ ఓవర్టన్ మార్క్రమ్ ఒక్కో వికెట్ తీశారు దీంతో రాయల్స్ 176 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ముందు నిలిపింది.176 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ప్రారంభంలో డేవిడ్ బెడింగ్‌హామ్ వికెట్ కోల్పోయింది. అయితే టోనీ డి జోర్జీ, జోర్డాన్ హెర్మన్ తమ ఆడటంతో క్రమశిక్షణగా బౌలర్లను ఎదుర్కొంటూ 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డిజోర్జీ 78 పరుగులతో ఔట్ అయ్యారు. కానీ హెర్మన్ 81 నాటౌట్‌తో నిలిచి కెప్టెన్ మార్క్రమ్ (11 నాటౌట్)తో మూడో వికెట్‌కు 69 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి సన్‌రైజర్స్‌ను విజయం వైపు నడిపించాడు.ఈ విజయం సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చింది. ఇప్పటికే రెండు సార్లు SA20 టైటిల్‌ను గెలిచిన సన్‌రైజర్స్ ఈసారి వరుసగా మూడో టైటిల్‌ను సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.