అనేక దశాబ్దాల కల నెరవేరింది. దక్షిణాఫ్రికా (South Africa) క్రికెట్ చరిత్రలో ఒక చిరస్మరణీయ అధ్యాయం మొదలైంది. ఎన్నోసార్లు (semifinal) లేదా (final) దాకా వచ్చి, చివర్లో ఓడిపోతూ “చోకర్స్” అన్న ట్యాగ్ తో బాధపడిన సఫారీ జట్టు, ఈసారి దానిని తుడిచేసింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్లో (In the Championship 2025 final) ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.విజయాన్ని సాధించడంలో ఐడెన్ మార్క్రమ్ కీలకంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా, మార్క్రమ్ (136 పరుగులు, 207 బంతుల్లో) వీరోచిత ప్రదర్శనతో నిలిచింది. అతనికి కెప్టెన్ టెంబా బవుమా (66 పరుగులు) మెరుపుగా సహకరించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం నమోదు చేశారు. చివర్లో బెడింగ్‌హామ్, వెర్రెయిన్ జట్టును విజయతీరాలకు చేర్చారు.
మొదటి ఇన్నింగ్స్‌లో పోటీ కఠినమే
టాస్ గెలిచి బౌలింగ్ చేసిన సఫారీ జట్టు, ఆసీస్‌ను 212 పరుగులకు కట్టడి చేసింది. రబడ 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. కానీ దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు కుప్పకూలింది. పాట్ కమిన్స్ 6 వికెట్లతో అదరగొట్టాడు.
రెండో ఇన్నింగ్స్‌లో తిరుగులేని సఫారీ దాడి
74 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా, 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మిచెల్ స్టార్క్ (58 నాటౌట్), కేరీ (43) మాత్రమే కొంత పోరాడారు. రబడ మరోసారి 4 వికెట్లు తీసి జెరాక్సుగా మారాడు.అంతిమంగా 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు, మేటి ఆటతో విజయం సాధించింది. మార్క్రమ్ “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్”గా నిలిచాడు. గెలుపుతో సఫారీ అభిమానుల దశాబ్దాల కల నిజమైంది. ‘‘చోకర్స్’’ అనే ముద్రను చెరిపేసింది.
Read Also : Harish Rao : రేవంత్ రెడ్డి, కేంద్రంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు