సౌందర్య మరణం పై ఆమె భర్త వివరణ

సౌందర్య మరణం పై ఆమె భర్త వివరణ

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి సౌందర్య మరణానికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, ఇందులో కొన్ని కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు పేరు కూడా వార్తల్లో ప్రస్తావించబడుతోంది.

Advertisements

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు

సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు సౌందర్య ఆస్తులకు సంబంధించి మోహన్ బాబు అక్రమంగా వాటాను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు.ఖమ్మం జిల్లా సత్యనారాయణపురానికి చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి, హైదరాబాద్ శివారు జల్‌పల్లిలో ఉన్న గెస్ట్ హౌస్ ఒకప్పటి హీరోయిన్ సౌందర్యదని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత, నటుడు మోహన్ బాబు బలవంతంగా దానిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.అంతేకాకుండా, ఆ గెస్ట్ హౌస్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అనాధ ఆశ్రమం లేదా మిలిటరీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా కలెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు.

సౌందర్య భర్త రఘు స్పందన

ఈ ఆరోపణలపై సౌందర్య భర్త రఘు అధికారికంగా స్పందించారు. ఆయన ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని, ఈ విషయాన్ని అసత్య ప్రచారంగా కొట్టిపారేశారు.సౌందర్య, మోహన్ బాబుల మధ్య ఎలాంటి భూ లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు.ఇద్దరి కుటుంబాల మధ్య గత 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని, ఎవరూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు.తాను మోహన్ బాబును ఎంతో గౌరవిస్తానని, తమ కుటుంబం ఒకటే అని చెప్పారు.ఇలాంటి తప్పుడు ప్రచారాలను వెంటనే ఆపాలని రఘు విజ్ఞప్తి చేశారు.

soundarya 8 jpg

ఆరోపణలు

తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు సినీ పరిశ్రమలో ఓ విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. ఆయన గతంలోనే సౌందర్యకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని, ఆమె కెరీర్‌లో కీలకంగా మద్దతిచ్చారని సినీ వర్గాలు చెబుతుంటాయి.సౌందర్య మరణం విషాదం విమాన ప్రమాదంలో ఆమె చనిపోయింది. అయితే, ఆమె మరణానికి సంబంధించి అప్పట్లోనే కొన్ని వదంతులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆస్తి వివాదాల కోణంలో ఈ వార్తలు బయటకు రావడం గమనార్హం.సినీ పరిశ్రమలో పలు రకాల వార్తలు, వదంతులు ఎప్పుడూ లేవనెత్తబడుతూనే ఉంటాయి. కానీ సౌందర్య భర్త రఘు స్వయంగా స్పందించి, ఈ ఆరోపణల్ని ఖండించడం కీలకంగా మారింది. నిజం తెలుసుకోకుండా అనవసరమైన ఆరోపణలు చేయడం, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం తప్పని, ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related Posts
లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి
లైలా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి

టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ ప్రముఖ ద‌ర్శ‌కుడు రామ్‌నారాయ‌ణ్ కాంబినేష‌న్‌లో వస్తున్న తాజా చిత్రం ‘లైలా’ ఈ సినిమాలో విష్వక్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించ‌నున్నారు. ఈ Read more

సనాతన ధర్మం.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin reacts to Pawan Kalyan comments on Sanatana Dharma

Udhayanidhi Stalin reacts to Pawan Kalyan comments on Sanatana Dharma చెన్నై: జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని ఎవరూ Read more

దారుణంగా పతనమైన రూపాయి విలువ
indian currencey

రోజురోజుకు రూపాయి మారకం విలువ పడిపోతూ వున్నది. నేడు దారుణంగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే తొలిసారి 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ Read more

మర్డర్‌ మిస్టరీగా విజయ్‌ ఆంటోని ‘గగన మార్గన్’
vijay antony

నటుడిగా దర్శకుడిగా గీత రచయితగా సంగీత దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న విజయ్ ఆంటోని ఇప్పుడు మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు ఈ చిత్రం డిటెక్టివ్ Read more

Advertisements
×