ముంబయి-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డుప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది ఈ ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య సోనాలి, ఆమె సోదరి, మేనల్లుడు కారులో ప్రయాణిస్తున్నారు. వీరు ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో వెళుతుండగా, అది ఓ ట్రక్కును బలంగా ఢీకొంది వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది.కానీ నిజంగా గొప్ప విషయం ఏంటంటే, ఈ ముగ్గురు ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.అవును ఒక్క గాయము కూడా లేకుండా బయటపడ్డారు ఇదంతా కేవలం వారి అప్రమత్తత వల్లే సాధ్యమైందని అంటున్నారు సోనూసూద్.తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఆయన,”వెనుక సీటులో ఉన్నా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ప్రాణాలు నిలుస్తాయి” అంటూ స్పష్టంగా చెప్పారు.సోనూసూద్ చెప్పారు – “నా భార్య, కుటుంబ సభ్యులు అందరూ సీట్ బెల్ట్ ధరించారే గానీ,లేకపోతే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉండేదేమో.

”ఆయన మాటల్లో ఒక రకం ఆత్మవేదన కనిపించింది, కానీ అంతకంటే ఎక్కువగా,బాధ్యతతో కూడిన సలహా ఉంది.బాధ్యతాయుతంగా వ్యవహరించడం గురించి మాట్లాడిన సోనూ, వెనుక సీట్లో ఉన్న ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు.సాధారణంగా ముందు సీట్లో కూర్చున్నవాళ్లు మాత్రమే బెల్ట్ వేస్తారు. కానీ ఇదే అప్రయత్నత ప్రమాదాలకు కారణమవుతుందన్నారు.ఇంకా రోడ్డుప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ, “రూల్స్ పాటించకపోతే ప్రాణాలు పోవచ్చు.డ్రైవింగ్ చేసే వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి.నిర్లక్ష్యం ప్రమాదాన్ని ఆహ్వానిస్తుంది” అని ఆయన తెలిపారు.ఈ సందర్భంలో ప్రజలకు చాలా ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. “కారు లోపల ఎక్కడ కూర్చున్నా, సీట్ బెల్ట్ వేసుకోవడం మానవజీవితాన్ని కాపాడే పరిష్కారం.ఇది అలవాటుగా మలుచుకోవాలి.”క్లుప్తంగా చెప్పాలంటే – సోనూసూద్ కుటుంబానికి జరిగిన ప్రమాదం ఒక హెచ్చరిక లాంటిది.ప్రతి ప్రయాణికుడు సీట్ బెల్ట్ ధరించాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఆయన ద్వారా మనం తెలుసుకోవచ్చు.
Read Also : Shalini Pandey: రణబీర్ కపూర్ తో నటించాలనేది నా కోరిక: షాలినీ పాండే