Somu Veeraju : జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు వైసీపీ అధినేత జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని జగన్ అనుకోవడం కేవలం కలగానే మిగిలిపోతుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.2014లో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా వచ్చినప్పటికీ అసెంబ్లీకి వెళ్లలేదని వీర్రాజు గుర్తు చేశారు.

ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని చెప్పడం జగన్ ద్వంద్వ ధోరణిని బయటపెడుతోందని విమర్శించారు.కూటమి లక్ష్యం వైసీపీని పూర్తిగా ఖాళీ చేయడమేనని స్పష్టం చేశారు.అంతేకాదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా సోము వీర్రాజు మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని, తన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు భవిష్యత్తుపై గందరగోళంలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే మాటలు చెప్పి పదేళ్ల పాటు పాలన సాగించారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.