Solar Eclipse : ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.

ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుంది?
ఇక, ఈనెల 29వ తేదీన శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదేరోజు సూర్యగ్రహణం ఉంది. ఈ ప్రభావం కొన్ని రాశులపై పడుతోంది. నిర్దిష్ట సమయంలో గ్రహాలు రాశి సంచారం చేస్తే పడే ప్రభావం ఎలా ఉంటుందో ఇది అంతకుమించి అధికంగా ఉంటుంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుంది? ఏ రాశులకు బాగుంటుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి
నేను బాగానే ఉన్నాను.. ఇది నాకు సరిపోతుంది.. నేను చాలా అనుకూలమైన స్థితిలో ఉన్నాను అనే ఆలోచన నుంచి మీరు బయటపడాలి. ఆ స్థితి నుంచి బయటకు వచ్చి కొత్త కొత్త లక్ష్యాల దిశగా పయనించాలి. అందుకు అవసరమైన బలాన్ని శని అందజేస్తాడు. జీవితంలో సరికొత్త అనుభవాలను చవిచూస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక విజయం ఉంది. దీనివల్ల అందరూ బాగుంటారు. ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు.
కన్యారాశి
ఎదుటి వ్యక్తులతో ఎంతో అనుబంధంగా ఉండాలి. అలా బంధం లేకపోతే మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నమవుతాయి. దీనివల్ల నష్టపోతారు. వ్యక్తిగత సంబంధాలు, ప్రేమ సంబంధాలు, దాంపత్య బంధం, వ్యాపారంలో భాగస్వామ్యం.. కుటుంబంలో అనుబంధం.. ఇలా అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఇలా చేయనినాడు తీవ్రంగా నష్టపోతారు. ఆధ్యాత్మిక వాతావరణంవైపు మొగ్గుచూపిస్తారు. భక్తిమార్గం వైపు పయనిస్తారు. ఇబ్బందులన్నింటి నుంచి బయటపడతారు.
వృషభ రాశి
నీతికి, నిజాయితీకి ప్రతిరూపం శనిదేవుడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శని ఈ రాశులకు ఎదుగుదలను ఇస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచిస్తారు. మానవ సంబంధాల ప్రాముఖ్యతను వివరిస్తాడు. అలాగే జీవితంలో ఎదగడానికి తోడ్పడతాడు. కుటుంబ సభ్యులందరితో కలిసి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. తద్వారా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను అందుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలను తగు సమయంలో శనిదేవుడు అందజేస్తుంటాడు.