Snowfall Blankets Jammu and Kashmir, Transforming Tourist

శ్వేత వర్ణంలో జమ్ముకశ్మీర్‌

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో మంచు వర్షం కురుస్తోంది. బారాముల్లా, సోనమార్గ్‌, బందిపోర సహా అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఎటు చూసినా పరిసరాలన్నీ శ్వేత వర్ణంలో దర్శనమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో నిరంతరంగా మంచు కురుస్తున్నది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక ప్రజలు, సందర్శకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.

Advertisements

సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్‌ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. మంచు వర్షానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.

మరోవైపు భారీగా మంచు పడుతుండటంతో శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి చేరాయి. ఉష్ణోగ్రతలు మైనస్‌ 1 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు కశ్మీర్‌ ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.

Related Posts
UK Lottery : బంపర్ లాటరీ గెలిచాడు…కానీ
UK Lottery : బంపర్ లాటరీ గెలిచాడు…కానీ

ఇంగ్లండ్‌లో ఒక లాటరీ టికెట్ ఓ వ్యక్తి జీవితాన్ని తారుమారు చేయబోతోంది. కానీ ఇంకా ఆ అదృష్టవంతుడు ఎవరో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. హద్దులు లేని Read more

కొండా సురేఖపై పరువు నష్టం కేసు.. ఇదొక గుణపాఠం కావాలి: కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Konda Surekha defamation case should be a lesson. KTR key comments

హైదరాబాద్‌: ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే వదిలిపెట్టేది లేదంటూ.. కొండా సురేఖపై పరువు నష్టం దావా అంశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. Read more

తిరుమల బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
tirumala brahmotsavam 2024

తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం ముందు అపశ్రుతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. సాయంత్రం నిర్వహించే ధ్వజారోహణలో ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఈ కొక్కి ద్వారానే Read more

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌కు ఉచితంగా భూమి
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌కు ఉచితంగా భూమి

శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ మురళీధరన్‌కు ఉచితంగా భూమి శ్రీలంక స్పిన్ మురళీధరన్ కు జమ్మూ కశ్మీర్‌లో ఉచిత భూమి కేటాయింపు రాజకీయంగా దుమారం రేపుతోంది. కథువా జిల్లాలో Read more

×