భారతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన స్మృతి ఇరానీ ఓ ఆసక్తికరమైన ప్రయాణం చేశారు. కెరీర్ ప్రారంభంలో మోడలింగ్‌లో రాణించిన ఆమె, టెలివిజన్ ఇండస్ట్రీలో పాపులర్ నటి అయ్యారు. ప్రముఖ దర్శకురాలు ఏక్తా కపూర్ రూపొందించిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ అనే సీరియల్‌తో స్మృతి ఇరానీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తులసీ అనే పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే, స్మృతి ఇరానీ కుటుంబానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తో ఉన్న అనుబంధం వల్ల ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. దీంతో 2003లో భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.
2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన స్మృతి
స్మృతి ఇరానీ దాదాపు 15 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఓటములను ఎదుర్కొన్నారు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అమేథీ నియోజకవర్గంలో ఓడించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీనితో ప్రధాని నరేంద్ర మోడీ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిగా ఆమెకు బాధ్యతలు అప్పగించారు.

మళ్లీ నటనలోకి అడుగుపెట్టనున్న స్మృతి ఇరానీ?
కేంద్ర మంత్రిగా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉన్న స్మృతి ఇరానీ ఇప్పుడు మళ్లీ బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. టీవీ సీరియళ్లను నిర్మించడంలో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిన ఏక్తా కపూర్, తాను నిర్మించిన సూపర్ హిట్ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ ను వెబ్‌సిరీస్‌గా తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో తులసి పాత్రలో మళ్లీ స్మృతి ఇరానీనే కనిపించనున్నారట. గతంలో అనేక మంది అభిమానులు ఈ సీరియల్‌ను ఎంతగానో ఎంజాయ్ చేసారు. ఎక్కువ ఎపిసోడ్స్ లాగా కాకుండా లిమిటెడ్ ఎపిసోడ్స్‌తో మరోసారి ప్రేక్షకులకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారని బీ టౌన్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఓ ప్రత్యేకమైన కథాంశంతో ఈ సిరీస్ రూపొందించాలని ఏక్తా కపూర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలుగు ప్రేక్షకులకు కూడా స్మృతి ఇరానీ అనుకుని ఉండరు. మరోవైపు స్మృతి ఇరానీ తెలుగులో ‘జై భోలో తెలంగాణ’ సినిమాలో ఆమె ముఖ్యపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వచ్చిన ఈ సినిమా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన క్రమంలో రాజకీయంగా చర్చనీయాంశమైన మూవీగా నిలిచింది. ఆ సినిమాలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో మళ్లీ పూర్తి స్థాయిలో కొనసాగుతారా? లేక బాలీవుడ్ కెరీర్‌పై ఫోకస్ పెడతారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం నటిగా రీ ఎంట్రీకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.