Sitara Ghattamaneni PMJ Jew

పీఎంజే జ్యూవెల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సితార

పీఎంజే జ్యూవెల్స్ మరో సరికొత్త క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. పీఎంజే జ్యూవెల్స్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి ఘట్టమనేని సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మోడర్న్ లిటిల్ ప్రిన్సెస్ సితార పీఎంజే జ్యూవెల్స్ విశిష్టతను, ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ మరో క్యాంపెయిన్‌ కు శ్రీకారం చుట్టారు. ఈ క్యాంపెయిన్‌లోని సరికొత్త కలెక్షన్ ఆభరణాలు భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. పచ్చలు, వజ్రాలు, కెంపులతో అద్దిన, అత్యాధునికంగా, కళాత్మకంగా తయారైన ఎన్నోరకాలు డిజైన్ల కలెక్షన్ అందుబాటులో తీసుకు వచ్చారు పీఎంజే జ్యూవెల్స్.

పెళ్లి నగలతోసహా ‌రకాల వేడుకల్లో ధరించేందుకు అనువుగా ఈ ఆభరణాలు తయారయ్యాయి. ఈ జ్యుయెలరీ కలెక్షన్‌ను మీరు ధరిస్తే రాయల్ లుక్‌ మీ సొంతం. వేడుక ఏదైనా సరే మీరు మెరిసిపోవడం ఖాయం. పీఎంజే జ్యువెల్స్ లేటెస్ట్ కలెక్షన్ ఆభరణాలు ధరించిన సితార ఫొటోలను టైమ్స్ స్క్వేర్ వద్ద ఆవిష్కరించారు. ఈ లేటెస్ట్ క్యాంపెయిన్ ద్వారా భారతీయ నగల విశిష్టత, ప్రత్యేకత ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తెలుసుకోబోతున్నారు. కళాత్మకమైన ఆభరణాల ప్రత్యేకతను చాటిచెప్పడమే కాకుండా భారతీయ వారసత్వాన్ని, నైపుణ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకే ఈ క్యాంపెయిన్ అని పేర్కొన్నారు పీఎంజే జ్యూవెల్స్. అన్నట్టు ఈ బ్రాండ్స్ ద్వారా తానూ సంపాదించిన మొత్తాన్ని మహేశ్ బాబు ఛారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేస్తానని ఘట్టమనేని సితార ఓ ఇంటర్వ్యూ లో తెలిపింది ఘట్టమనేని వారసురాలు.

Related Posts
ఆప్ ఓటమి పై స్వాతి మాలీవాల్ ట్వీట్
Swati Maliwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం 'ద్రౌపది Read more

Warden Posts : నేడు వార్డెన్ పోస్టుల తుది జాబితా
telangana Warden Posts

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ హాస్టళ్లలో 581 వార్డెన్ అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను నేడు టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రకటించనుంది. Read more

బరాక్ ఒబామా, మిషెల్ విడాకులు..?
Barack Obama, Michelle divorce..?

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మిచెల్‌ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు Read more

సౌతిండియా అఖిలపక్ష సమావేశానికి జగన్ కు పిలుపు
Jagan invited to South Indi

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు మంత్రి ఈవీ వేలు, డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ బుధవారం Read more