కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల (Dharmasthala ) ప్రాంతంలో భయానక ఘటనలపై ఆ రాష్ట్ర ప్రజల్లో కలకలం రేగుతోంది. 1998 నుండి 2014 మధ్యకాలంలో వందలాది మంది మహిళలు, యువతులను పీడించి చంపినట్టు, వారి మృతదేహాలను నేత్రావతి నది ఒడ్డున పూడ్చినట్టు సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి. ఈ విషయాన్ని ఇటీవల ఓ మాజీ శానిటేషన్ ఉద్యోగి బయటపెట్టాడు. తనను బలవంతంగా ఆ మృతదేహాలను పూడ్చే పని చేయించారని ఆయన వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి ఓ అస్థిపంజరాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఆశ్చర్యం కలిగించే విషయాలు – ప్రభుత్వ స్పందన
ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాక, ప్రజల్లో భయం, ఆశ్చర్యం కలిగింది. విషయానికి ప్రాధాన్యత ఇస్తూ కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ సంఘటనలపై సమగ్రంగా విచారణ చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తామని అధికారికంగా ప్రకటించింది. కేసుకు సంబంధించి సాక్ష్యాలను సేకరించడం, మృతదేహాల ఆవశేషాల విశ్లేషణ, DNA పరీక్షలు వంటి అంశాలు ఇందులో భాగం కానున్నాయి.
న్యాయం కోసం పోరాటం – ప్రజల్లో నిరాశ, ఆందోళన
ఈ ఆరోపణలు నిజమైతే, ఇది కర్ణాటకలో ఇప్పటివరకు వెలుగుచూసిన అత్యంత భీకరమైన మానవ హత్యల కేసుగా నిలవనుంది. వందలాది మహిళలు గల్లంతయ్యారన్న వార్తలు స్థానికులను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటి వరకు పోలీసులకు తెలియనిది, ఇన్నేళ్ల తర్వాత బయటపడుతుండటం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ దర్యాప్తు ఎటు వైపు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.
Read Also : Midhun Reddy : రాజమండ్రి జైలుకు మిథున్ రెడ్డి తరలింపు