సింహ రాశి

సింహ రాశి

సింహ రాశి

19-03-2026  |  గురువారం
ఆదాయం 05
వ్యయం 05
రాజపూజ్యం 07
అవమానం 07

సింహరాశి వారికి ఈ సంవత్సరం లాభం, వ్యయం, లగ్నంలో గురువు, లగ్నం, వ్యయంలో కేతువు, సప్తమం షష్టమలో రాహువు, అష్టమంలో శనీశ్వరుడు, గ్రహాల సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హెూమం జరిపించండి. మెడలో కాలభైరవ రూపు ధరించండి. కొత్త కార్యక్రమాలు మంచి ఉత్సాహంతో ప్రారంభిస్తారు. మంచి విజయాలను సాధించగలుగుతారు. ఎంతగానో శ్రమించి కార్యక్రమాలను ఘనవిజయం చేస్తారు. కొంతమంది చెప్పే అబద్ధాలు కారణంగా ఎంతగానో మనసు కష్టం పెట్టుకుంటారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కలగవచ్చు.

దూర ప్రాంతాల్లో ఉన్న వారి చేత మీకు కావాల్సిన పనులను చేయించుకోగలుగుతారు. ఇది మీకు ఉపయోగపడే అంశంగా మారుతుంది. ప్రత్యక్షంగా మీరు లేనప్పటికీ మీకు సహకరించి అండదండలు అందించేవారు. మీకు పని చేసి పెట్టే వారి వలన పరోక్షంగా లాభపడగలుగుతారు. స్నేహ సంబంధం వలన మంచి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఏర్పడతాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వారికి వృత్తి నిర్వహణ కత్తి మీద సాముగా మారుతుంది. ఎంతో కష్టపడి మీరు పనులు చేయడం పై అధికారుల ఒత్తిడి కారణంగా అవి పక్కకు పడేటము మళ్లీ పనులలో పురోగతి లేదని వెంబడించడం ఇదే కాలక్షేపంగా కొంతమందికి మారుతుంది. సంతానానికి సంబంధించిన విషయాలలో నిదానంగా పురోగతి ఏర్పడుతుంది. మీరు ఊహించిన స్థాయికి మాత్రం వాళ్ళ అభివృద్ధి చేరకపోవచ్చు.

ఇది కొంత కాలం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. క్రీడారంగంలో ప్రావీణ్యత సంపాదించడం కోసం కొంతకాలం చదువులను పక్కనపెట్టి అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పారితోషికం మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి శ్రమించి సాధించిన ఒక విజయం పరులకు చెందటం మిమ్మల్ని కించపరిచే విధంగా ఉండటం ఎంతో బాధకి గురిచేస్తుంది. కొంతమంది మీ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వారితో స్నేహాన్ని మరింత బలపరుచుకోవడానికి ఎంతగానో ఆకాంక్షిస్తారు. కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఆహార పానీయాలలో దొర్లే నిర్లక్ష్యం అశ్రద్ధ అనారోగ్యానికి కారణమవుతుంది.

భార్యాభర్తల అన్యోన్యత మీద ఎక్కువ మందికి ఏడుపులు ఉంటాయి. మీరు మీ సఖ్యత విషయాలలో జాగ్రత్తలు వహించండి. అపోహల బారిన పడి బాగున్న కాపురాన్ని పాడు చేసుకోవద్దు పొదుపు పథకాలలో చిన్న మొత్తాలుగా ధనాన్ని కూడబెడతారు. అవి ఒక కార్యక్రమానికి ఉపయోగపడాలని మీరు తలుస్తారు. ఒకానొక సంతోషకరమైన వాతావరణంలో మీరంటే పడ నటువంటి వ్యక్తులు వాళ్ళకి మీ మీద ఎంత కోపం ద్వేషము ఉన్నాయో బయటకి ప్రకటిత మవుతాయి. అవి విని చూసి మీరు ఎంతో ఆశ్చర్యపోతారు నేను ఎప్పుడు వాళ్ళకి కీడు తలపెట్టలేదు అన్యాయం చేయలేదు బాధ పెట్టలేదు. కానీ వాళ్ళకి నా మీద ఇంత ద్వేషం ఎందుకు అని మీరు వాపోతారు. రోజువారి ఖర్చులు, నెలవారి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి జీతం మాత్రం పెరగక పోవడం వల్ల నిరుత్సాహ పడతారు. సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఏదైన అధునాతన సాంకేతిక అంశాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని విషయాలను సొంతంగా నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. షార్ట్ టర్మ్ కోర్సులను తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి రీత్యా అవి మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. దూరప్రాంతాలలో ఉన్న పాత స్నేహితుల ద్వారా కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. స్థలాల విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఒకానొక సందర్భంలో కొంతమంది వ్యక్తులు మీ స్థలాల పట్ల చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను మీ స్నేహితుల ద్వారా తిప్పికొట్టగలుగుతారు. ఎంతో ధైర్యాన్ని తిరిగి సంపాదిస్తారు. వివాహ సంబంధమైన విషయాలలో అనుకూల మార్పులు ఏర్పడతాయి. కీలక నిర్ణయాలలో పెద్దవాళ్లు ఒక పట్టాన ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోవడం మీరు ఆశిస్తున్నట్టుగా వాళ్ళు చేయకపోవడం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడానికి కారణంగా మారుతుంది. ఒకానొక సమయంలో కన్నవాళ్ళు మీకు అండగా నిలబడతారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు మీరు ఆశిస్తున్న స్థాయిలో ఉపయోగపడరు.

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం 80%
సంపద 100%
కుటుంబం 80%
ప్రేమ సంభందిత విషయాలు 60%
వృత్తి 80%
వైవాహిక జీవితం 80%
Sun

వారం - వర్జ్యం

తేది : 19-03-2026, గురువారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం , చైత్రమాసం , ఉత్తరాయణం వసంత ఋతువు , శుక్లపక్షం ఉత్తరాభాద్ర కార్తె
అమావాస్య ఉ.6.53 , సా. పాడ్యమి తె.4.51 , ఉత్తరాభాద్ర తె.4.03
వర్జ్యం: మ.2.26-3.52
రాహుకాలం: మ.1.30 - 3.00

మీకు నచ్చవచ్చు