ప్రస్తుతం వెండి (Silver) ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్న వెండి (Silver) ఈ దీపావళికి కిలోకు రూ.1.30 లక్షలు దాటే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంచనా పెట్టుబడిదారులకే కాదు, సామాన్యులకు కూడా పెద్ద సంకేతం. అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు కొంత మెరుగుపడటం, దీని వల్ల పారిశ్రామిక వినియోగం పెరిగి వెండి డిమాండ్ మరింత పెరిగిందని నిపుణుల వెల్లడి.
వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం
దీపావళి వరకు వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ధర రూ. 1 లక్ష 25 వేల నుంచి రూ. 1 లక్ష 30 వేలకు పెరగవచ్చు. దీనికి ప్రపంచ మార్కెట్లో సాంకేతిక పురోగతి అతిపెద్ద కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు $37 స్థాయిని తాకింది. ఇది ఒక ముఖ్యమైన కారణం అంతేకాదు అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం పారిశ్రామిక డిమాండ్‌ను పెంచింది. క్లీన్ ఎనర్జీ, 5G టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) వంటి పారిశ్రామిక రంగాలలో వెండిని 53-56% వరకు ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా వెండికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.
వెండికి మరింత ప్రాధాన్యత
ప్రస్తుతం బంగారం వెండి నిష్పత్తి 91కి దగ్గరగా ఉందని,.. బంగారంతో పోలిస్తే వెండి ఇప్పటికీ పెట్టుబడికి ఆకర్షణీయంగా ఉందని ఇది చూపిస్తుందని అజయ్ కేడియా అన్నారు. చారిత్రాత్మకంగా ఈ నిష్పత్తి అరుదుగా 90 కంటే ఎక్కువగా ఉంది. అది తగ్గినప్పుడు, వెండి (Silver) ధరలు పెరుగుతాయి. మరోవైపు డిమాండ్ కు తగ్గట్లుగా వెండి సప్లయి లేదు. ఈ కారణంగా వెండి లోటులో ఉన్న ఐదవ సంవత్సరం ఇది. ఈ లోటు వెండి (Silver) ధరలను మరింత పెంచింది.

ETFల వలన వేగంగా పెరుగుతోంది
వెండిలో పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) ముఖ్యమైన పాత్ర పోషించాయి. గతంలో ధన్ తేరస్ లేదా అక్షయ తృతీయ వంటి సందర్భాలలో మాత్రమే వెండిని కొనుగోలు చేసేవారు.. అయితే ఇప్పుడు ప్రజలు వెండిని మంచి పెట్టుబడిగా చూస్తున్నారు. డిజిటల్ వెండి , ETFల ద్వారా తక్కువ మొత్తంలో చిన్న పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా వెండిని మల్టీ-అసెట్ ఫండ్లలో చేర్చడం ప్రారంభించాయి. ఇది వెండి పెట్టుబడి విషయంలో ప్రజాదరణను పెంచింది. పారిశ్రామిక వృద్ధితో వెండి డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది. సరఫరా తగ్గితే ధరలు మరింత పెరగొచ్చు. ఐతే బంగారంతో పోలిస్తే సులభంగా లభించే, అధిక రాబడి కలిగించే సంపత్తిగా వెండి మారుతోంది.
దీపావళి నాటికి వెండి ధర – అంచనాలు
ఈ ఏడాది చివరి నాటికి ముఖ్యంగా దీపావళి నాటికి వెండి ధర కిలోకి రూ.1.30 లక్షలకు చేరుకోవచ్చని అంటున్నారు. గత 60 రోజుల్లో వెండి (Silver) 24% రాబడిని ఇచ్చింది. ఇది ఇతర పెట్టుబడి ఎంపికల కంటే చాలా ఎక్కువ. పారిశ్రామిక డిమాండ్, సరఫరా లేకపోవడం, పెట్టుబడిదారులలో ఆసక్తి పెరుగుతున్న కారణంగా.. వెండి ధరల్లో ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో బంగారం కంటే వెండి (Silver) రాబడికి మంచి ఎంపికగా పరిగణించబడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది దీర్ఘకాలిక పెట్టుబడికి ఒక సువర్ణావకాశం. వెండి ధరలు రికార్డుల వెంట పరుగులు తీస్తున్నాయి. దీపావళి నాటికి పతాక స్థాయిని చేరే అవకాశాలున్నాయి. మీ పెట్టుబడి ప్రణాళికల్లో వెండికి ఒక స్థానం కల్పించాలి. ఇది లాంగ్ టర్మ్‌లో మంచి వృద్ధిని అందించగల అవకాశంగా మారవచ్చు.
Read Also: World Bank: భారత వృద్ధి 6.3% మాత్రమే – వరల్డ్ బ్యాంక్ అంచనా