ప్రఖ్యాత టెక్నాలజీ శాస్త్రవేత్త మరియు బిలియనీర్ ఎలాన్ మస్క్ (Billionaire Elon Musk) తన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ ‘స్టార్లింక్’ ద్వారా ప్రపంచ టెలికమ్యూనికేషన్ రంగంలో మరో విప్లవానికి నాంది పలికారు. మస్క్ ప్రకారం, సెల్యులార్ టవర్లు లేకున్నా ఫోన్లకు నెట్‌వర్క్ సిగ్నల్స్ ఇవ్వగల సామర్థ్యం ఇప్పుడు స్టార్లింక్ శాటిలైట్లకు ఉంది. ఇది ప్రపంచంలో ఎక్కడా “డెడ్ జోన్” ఉండకూడదనే లక్ష్యంతో తీసుకొచ్చిన టెక్నాలజీ అని తెలిపారు.
ఎక్కడి నుంచైనా సిగ్నల్ – టవర్స్ అవసరం లేదు
మస్క్ చెప్పిన విషయాల ప్రకారం, భూమి చుట్టూ తిరుగుతున్న స్టార్లింక్ శాటిలైట్ల సాయంతో, మొబైల్ ఫోన్లు టవర్ల అవసరం లేకుండానే నెట్‌వర్క్ సిగ్నల్స్‌ను అందుకుంటాయి. అంటే, అటవీ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, సముద్రతీరాలు, ఎలాంటి సెల్ టవర్ సౌకర్యం లేని ప్రాంతాల్లోనూ మొబైల్ ద్వారా కమ్యూనికేషన్ జరగడం సాధ్యమవుతుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు గొప్ప సహాయంగా నిలవనుంది.
భవిష్యత్తులో మెసేజింగ్ విధానానికి మారుపైరు
ఈ టెక్నాలజీతో సహజ విపత్తులు, ప్రమాదకర పరిస్థితుల్లోనూ సమాచారాన్ని పంపడం మరింత సులభమవుతుంది. మస్క్ వెల్లడించిన ప్రకారం, “T-Satellite” సహకారంతో దేశంలో ఎక్కడి నుంచైనా మెసేజ్లు పంపడం సాధ్యమవుతుంది. టవర్ పై ఆధారపడకుండా, ఉపగ్రహాల సహకారంతో మెసేజ్‌లు పంపడం ఈ రంగంలో కీలక మైలురాయిగా చర్చించబడుతోంది.
Read Also : Telangana Secretariat : సచివాలయంలో ఊడిపడిన పెచ్చులు!