ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ (IPS officer Siddharth Kaushal) స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. గతంలో రాష్ట్రంలో కీలక భద్రతా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, తాజాగా వ్యక్తిగత కారణాలతో వీఆర్ (వాలంటరీ రిటైర్మెంట్) తీసుకున్నట్లు అధికారికంగా తెలిపారు. 2012 బ్యాచ్‌కు చెందిన కౌశల్ గత నెల రోజులుగా విధులకు దూరంగా ఉన్నట్లు సమాచారం.
ప్రాంతాల్లో కీలక భద్రతా బాధ్యతలు చేపట్టిన కౌశల్
సిద్ధార్థ్ కౌశల్ తన ఐపీఎస్ సేవల్లో భాగంగా కృష్ణా, ప్రకాశం, కడప (Kadapa) జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆయన ప్రజలతో సాన్నిహితంగా ఉండే విధానంతో ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్) గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన వీఆర్ తీసుకోవడం గమనార్హం. భద్రతా వ్యవస్థలో మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన ఆయన నిర్ణయం రాష్ట్ర పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వ్యక్తిగత కారణాలే నిర్ణయానికి దారితీశాయి
సిద్ధార్థ్ కౌశల్ తన రాజీనామాపై స్పందిస్తూ, ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమేనని తెలిపారు. భవిష్యత్తులో తన ప్రయాణం ఎలా ఉండబోతుందో తాను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఆయన వైదొలగడం నేపథ్యంలో, డీజీపీ కార్యాలయంలో కొత్త ఎస్పీ నియామకంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చే అవకాశమా? లేక మరే రంగంలోనైనా ఆయన అడుగుపెట్టబోతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : CM Chandrababu : ‘కుప్పం’పై సీఎం చంద్రబాబు వరాల జల్లు