हिन्दी | Epaper

Siddaramaiah: ఈ ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి..

Anusha
Siddaramaiah: ఈ ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి..

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మారుతుందనే ఊహాగానాలకు సీఎం సిద్ధరామయ్య ఒక్క ప్రకటనతో చెక్ పెట్టారు.రాష్ట్రానికి ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar) కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించేందుకు తనను రాజీనామా చేయమని అధిష్ఠానం కోరినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి పదవిలో పూర్తి ఐదేళ్లు నేనే ఉంటాను. ఈ విషయాన్ని జులై 2వ తేదీన డీకే శివకుమార్ సమక్షంలోనే స్పష్టం చేశాను. ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి (Chief Minister’s post) కి పోటీదారుడే, అందులో తప్పేమీ లేదు. అయితే ‘ప్రస్తుతం కుర్చీ ఖాళీగా లేదు’ అని ఆయనే అన్నారు కదా” అని సిద్ధరామయ్య గుర్తు చేశారు.

Siddaramaiah: ఈ ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు

డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన అంగీకరించారు.రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ఆయన స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, నిధుల కొరత లేదని సిద్ధరామయ్య (Siddaramaiah) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను, ముఖ్యంగా ఈడీని కాంగ్రెస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.

కర్ణాటక కొత్త ఉప ముఖ్యమంత్రి ఎవరు?

డీకే శివకుమార్ గారు కర్ణాటక రాష్ట్రానికి కొత్త ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

కర్ణాటక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు?

క్యాసంబల్లి చెంగలరాయ రెడ్డి (Kyasamballi Chengalaraya Reddy) గారు కర్ణాటకకు (అప్పట్లో మైసూరు రాష్ట్రం) తొలి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: RBI: NBFC ల నుంచి లోన్లు మరింత సులభం? RBI మార్గదర్శకాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!

ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్: శాంతి కోసం పిలుపు

ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్: శాంతి కోసం పిలుపు

గ్యాస్ దొరకట్లేదా.. ఈ నంబర్ కు కాల్ చేయండి

గ్యాస్ దొరకట్లేదా.. ఈ నంబర్ కు కాల్ చేయండి

అమెరికాలో భారీ మోసం, భారత సంతతి సోదరులకు 400 ఏళ్లకు పైగా జైలు శిక్ష?

అమెరికాలో భారీ మోసం, భారత సంతతి సోదరులకు 400 ఏళ్లకు పైగా జైలు శిక్ష?

దేశంలో బంగారం ధరలు స్వల్ప మార్పులు, ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

దేశంలో బంగారం ధరలు స్వల్ప మార్పులు, ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

నేడు రైతుల అకౌంట్లలోకి రూ.6వేలు

నేడు రైతుల అకౌంట్లలోకి రూ.6వేలు

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

📢 For Advertisement Booking: 98481 12870