రష్యాలో ఓ భావోద్వేగ భరిత ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రవాణా శాఖ మాజీ మంత్రి రోమన్ స్టారోవాయిట్ (Roman Starovoit) తాను పదవి కోల్పోయిన కొద్ది గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వెలువడడంతో రాజకీయ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న కీలక నిర్ణయానికి ఇది అనూహ్య పరిణామంగా నిలిచింది.మాస్కో శివారులోని ఓ పార్కింగ్ ప్రదేశంలో, తన కారులో రోమన్ స్టారోవాయిట్ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు (Roman Starovoit shot himself to death) తీసుకున్నట్లు రష్యా వార్తా సంస్థలు వెల్లడించాయి. దేశ ఇన్వెస్టిగేటివ్ కమిటీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. సోమవారం అధికారికంగా మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని ప్రకటించడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

ఒకే ఏడాది లోపే మంత్రి పదవి కోల్పోవడం కలవరానికి దారితీసింది
2024 మేలో రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టారోవాయిట్ కేవలం ఏడాదికి కొద్దిగా మించిపోయే వ్యవధిలోనే పదవిని కోల్పోయారు. ఆయనను ఎందుకు తొలగించారన్న దానిపై ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినా, జూలై 5, 6 తేదీల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యాలో పెద్ద ఎత్తున విమాన సర్వీసులు నిలిచిపోవడమే కారణమై ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో గవర్నర్‌గా సేవలందించిన నేతకు ఈ పరిస్థితి రావడం దురదృష్టం
ఉక్రెయిన్ సరిహద్దులోని కుర్స్క్ ప్రాంతానికి స్టారోవాయిట్ గవర్నర్‌గా దాదాపు ఐదేళ్లు పనిచేశారు. ఆయన సేవలు అప్పట్లో ప్రశంసలందుకున్నాయి. ఆ అనుభవంతోనే ఆయనను రవాణా మంత్రిగా నియమించిన ప్రభుత్వం… తాజాగా ఆయన స్థానంలో నోవ్‌గోరోడ్ గవర్నర్ ఆండ్రీ నికిటిన్‌ను నియమించింది.స్టారోవాయిట్ ఆత్మహత్య రాజకీయ ఆందోళనలకు దారి తీసింది. రష్యాలో పదవులు, ప్రజాస్వామ్య పద్ధతులపై ఉన్న ఒత్తిడిని ఇది మరోసారి వెలుగులోకి తెచ్చింది.
Read Also : Celebi : టర్కీ సంస్థకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ