हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Shilpa Chakravarty: టీజీ హైకోర్టును ఆశ్రయించిన శిల్పా చక్రవర్తి..కారణమిదే?

Anusha
Shilpa Chakravarty: టీజీ హైకోర్టును ఆశ్రయించిన శిల్పా చక్రవర్తి..కారణమిదే?

ప్రముఖ టీవీ యాంకర్‌, నటి అయిన శిల్పా చక్రవర్తి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెకు చెందిన వ్యవసాయ భూమిపై ఎస్ఐ, అనవసర జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ, తనకు న్యాయం చేయాలంటూ ఆమె తన భర్త జడ కల్యాణ్ యాకయ్యతో కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై విచారించిన హైకోర్టు సదరు ఎస్ఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని కోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది. సదరు ఎస్ఐకి కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు,టీవీ యాంకర్ శిల్పా చక్రవర్తి (Shilpa Chakravarty), ఆమె భర్త, నల్గొండ జిల్లా కుర్మేడ్‌ గ్రామంలో ఎనిమిది సంవత్సరాల క్రితం అనగా 2017లో కొనుగోలు చేసిన 32 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత దీనిపై వివాదం తలెత్తింది. ఈక్రమంలో తాజాగా శిల్పా చక్రవర్తి ఈల్యాండ్ వివాదంలో పోలీసుల జోక్యాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వివాదంలో

దీనిపై జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా జస్టిస్ టి.వి. వినోద్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జస్టిస్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడం సరికాదని సూచించారు. ఈ వివాదంలో ఎస్ఐ వ్యవహరించిన సెటిల్‌మెంట్ తీరును తప్పు పడుతూ, నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి (Rammurthy) తో పాటుగా, హోం డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీలతో పాటుగా, వివాదం నెలకొన్న నల్గొండ జిల్లా ఎస్పీ, దేవరకొండ డీఎస్పీకి సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో సమాధానమివ్వాలని కోర్టు ఆ నోటీసులలో స్పష్టం చేసింది.

Shilpa Chakravarty: టీజీ హైకోర్టును ఆశ్రయించిన శిల్పా చక్రవర్తి..కారణమిదే?
Shilpa Chakravarty: టీజీ హైకోర్టును ఆశ్రయించిన శిల్పా చక్రవర్తి..కారణమిదే?

తమ పిటిషన్‌లో

శిల్పా చక్రవర్తి తన పిటిషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, 2017లో మహ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తికి చెందిన 32 ఎకరాల వ్యవసాయ భూమిని శిల్పా చక్రవర్తి దంపతులు కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కుర్మేడ్ గ్రామం (Kurmed village) లో ఈ భూమి ఉంది. అయితే తాజాగా తమకు భూమిని అమ్మిన అజిజ్తో పాటుగా, చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి కూడా తమను వేధిస్తున్నారని శిల్పా చక్రవర్తి తమ పిటిషన్‌లో వెల్లడించారు.పైగా ఈ ల్యాండ్ వివాదంలో, ఎనిమిదేళ్ల క్రితమే అనగా 2017లోనే తాము సివిల్‌ కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్‌ ఆర్డర్స్‌తో పాటుగా, పోలీసు రక్షణ ఉత్తర్వులను కూడా పొందామని శిల్పా చక్రవర్తి తెలిపారు.

కౌంటర్లు దాఖలు

తమకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్స్ పొందినప్పటిక కూడా ఎస్ఐ రామ్మూర్తి ఈ ల్యాండ్ విషయంలో జోక్యం చేసుకుని తమను వేధిస్తున్నాడని ఆమె కోర్టుకు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లోనే ఈ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ సదరు ఎస్ఐ (SI) తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె పిటిషన్‌లో చెప్పుకొచ్చారు.ఈ పిటిషన్‌ని విచారించిన హైకోర్టు, ఇరువురి వాదనలను విన్న తర్వాత.. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. అలాగే తదుపరి విచారణను వచ్చేనెల అనగా ఆగస్టు 5కు వాయిదా వేశారు.

శిల్పా చక్రవర్తి ఎవరు?

శిల్పా చక్రవర్తి ఒక ప్రసిద్ధ టీవీ యాంకర్, నటి, నాటకకారిణి. తెలుగు టెలివిజన్ రంగంలో తన హోస్టింగ్, నటనా ప్రతిభతో మంచి పేరు సంపాదించారు.

శిల్పా చక్రవర్తికి టీవీ రంగంలో పేరు తీసుకువచ్చిన షోలు ఏమిటి?

శిల్పా చక్రవర్తి ‘అలీ 369’, ‘సుందరకాండ’, ‘సొగసుల సాగరం’, వంటి టీవీ షోలు, కార్యక్రమాలలో యాంకర్‌గా, నటి‌గా ప్రసిద్ధి పొందారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Ration Cards : పేదలకు రేవంత్ సర్కార్ తీపికబురు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870