ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), వైసీపీ అధినేత జగన్ (Jagan)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టిడిపి అధినేత చంద్రబాబుకు మధ్య హాట్‌లైన్ ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఆమె తీవ్రంగా ఖండించారు.జగన్ చెప్పిన హాట్‌లైన్ రాహుల్, చంద్రబాబుకి కాదు. అసలు హాట్‌లైన్ జగన్, ప్రధాని మోదీ, హోం మంత్రిగా ఉన్న అమిత్ షా మధ్య ఉంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, కేంద్రాన్ని మెప్పించడమే ఆయన లక్ష్యంగా ఉంది అని షర్మిల ఆరోపించారు.షర్మిల మాట్లాడుతూ, జగన్ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం కూడా కనబరచడం లేదు. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఆయనకు అనిపించదా? ఇలా మోదీకి దాసోహంగా మారి ఎలా పాలన చేస్తారు? అని ప్రశ్నించారు.

పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే
జగన్ రాజకీయ తీరును వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన షర్మిల, పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. తెరవెనుక రాజకీయం, పొత్తులే జగన్కు అలవాటు. అందుకే ఆయన అందరినీ అదేలా అనుకుంటారు, అన్నారు.“రాహుల్ గాంధీకి చంద్రబాబుతో ఎలాంటి హాట్‌లైన్ లేదు. ఇది మేము హామీగా చెబుతున్నాం. అయితే మీరు మోదీ, అమిత్ షాతో హాట్‌లైన్ లేదని బైబిల్ మీద ప్రమాణం చేస్తారా?” అంటూ షర్మిల జగన్‌ను నిలదీశారు.గత ఐదేళ్ల పాలనలో జగన్ పూర్తిగా బీజేపీకి లొంగిపోయారని షర్మిల ఆరోపించారు. “మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్… తర్వాత అదే మోదీకి వరుసగా నమస్కరించారని ఆరోపించారు. ప్రతి బీజేపీ బిల్లుకూ మద్దతు ఇచ్చారు,” అన్నారు.
విలువైన ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగింపు
గంగవరం పోర్టు వంటి కీలక ప్రాజెక్టులను మోదీకి సమర్పించారంటూ షర్మిల మండిపడ్డారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, ఎంపీ పదవులు కూడా బీజేపీ నేతలకు ఇవ్వడాన్ని తప్పుపట్టారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజేపీని మతతత్వ పార్టీగా పేర్కొనేవారు. కానీ ఆయన కుమారుడిగా చెప్పుకునే జగన్, అదే బీజేపీకి దగ్గరవడం సిగ్గు కాదా? అని షర్మిల ప్రశ్నించారు.ఏఐసీసీ ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన సంస్కారాన్ని చూపిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడే ధైర్యం ఉందా? అని మాణికం విసిరిన సవాలుకు జగన్ ఇప్పటికీ సమాధానం చెప్పలేదని అన్నారు.
లిక్కర్ స్కాం పై సమాధానం ఇవ్వండి
షర్మిల డిమాండ్ చేస్తూ, లిక్కర్ స్కాంపై స్పష్టత ఇవ్వండి. నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఎలా ఇచ్చారు? నగదు రూపంలో అమ్మకాలెందుకు జరిగాయి?” అని నిలదీశారు.మీదొక పార్టీ, మీరొక నాయకుడంటారా? అసెంబ్లీకి వెళ్లి ప్రజల కోసం, పార్లమెంటులో దేశం కోసం పోరాడలేరు. ఇది ఏ రకంగా నాయకత్వం? అని షర్మిల కుండ బద్ధలు చేశారు.
Read Also :