ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సందర్భంగా.. దేశంలోని హిందూ ధర్మాలకు చెందిన ముగ్గురు శంకరాచార్యులు భేటీ అయ్యారు. ఆ చరిత్రాత్మక భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు సంయుక్త ప్రకటన జారీ చేశారు. సనాతన ధర్మరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. గో వధను ఆపేయాలని ధర్మాదేశం ఇచ్చారు. గోవును దేశమాతగా ప్రకటించాలని తీర్మానించారు. దేశ ఐక్యత, సమగ్రత.. సనాతన సంప్రదాయ పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను పేర్కొన్నారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్‌ను విజిట్ చేయాలని సనాతన ధర్మ ఫాలోవర్లకు శంకరాచార్యులు పిలుపునిచ్చారు.
మూడు ప్రముఖ పీఠాలకు చెందిన శంకరాచా ర్యలు భేటీ కావడం ఇదే మొదటిసారి. శృంగేరి శారదా పీఠంకు చెందిన విధు శేఖర భారతి, ద్వారకా శారదా పీఠానికి చెందిన సదానంద సరస్వతి, జ్యోతిర్ మఠానికి చెందిన అవిముక్తేశ్వరానంద సరస్వతి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
![](https://vaartha.com/wp-content/uploads/2025/01/maha-kumba-1024x576.jpg.webp)
ముగ్గరు శంకరాచార్యలు సంయుక్తంగా ప్రకటన రిలీజ్ చేశారు. సనాతన సంస్కృతి వృద్ధి, రక్షణపై 27 మార్గదర్శకాలను రిలీజ్ చేశారు. సంస్కృత భాష ప్రాముఖ్యతపై దృష్టి పెట్టాలని శంకరాచార్య సదానంద సరస్వతి తెలిపారు. గోవును దేశమాతగా గుర్తించాలని కోరుతూ శృంగేరి పీఠాధిపతి విధు శేఖర భారతి తెలిపారు. సంస్కృత విద్య ప్రమోషన్ కోసం కేంద్రం నిధుల్ని కేటాయించాలని అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలిపారు. నదులు, కుటుంబ వ్యవస్థ సంరక్షణ గురించి శంకరాచార్యులు ప్రకటన చేశారు.